fightoncults.com

యెహోవా సాక్షులు

వీరి కరపత్రికల పరిచర్య పేరు “కావలి కోట” (Watch tower). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో ముద్రించబడుతున్న నెలవారి మ్యాగజైన్స్లో ఈ Watch tower మ్యాగజైన్ నెలకు 4 కోట్ల 60 లక్షల కాపీలను 180 భాషల్లో ముద్రిస్తూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. పల్లెటూర్లు, పట్టణాలు అని బేధం లేకుండా ప్రతీ చోటా ఇవి పంచబడుతున్నాయి. వీరి వెబ్సైట్ పేరు www.jw.org. ఈ శాఖ యొక్క ప్రధాన కేంద్రం Newyork లో ఉంది. వీరికి అమెరికాలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. దాని నుండి వచ్చే  ఆదాయంతో పాటు, యెహోవా సాక్షులు ఇచ్చే భారీ కానుకలతో ఈ శాఖ ప్రపంచంలో 160 దేశాలకు వ్యాపించింది. ‘ఇంటింటి పరిచర్య‘ వీరి ప్రత్యేకత. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతీ ఇంటినీ వీళ్లు దర్శిస్తారు. కానీ వీళ్ళ దృష్టంతా మాత్రం ఎప్పుడూ క్రైస్తవులపైనే ఉంటుంది. వీళ్ళు బోధించేటపుడు పదే పదే హీబ్రూ పదాల్ని, గ్రీకు పదాల్ని చూపిస్తుంటారు. వాటి అర్థాలు చాలామందికి తెలియవు కాబట్టి సులువుగా మోసం చేస్తారు. వీళ్ళు తమని తాము క్రైస్తవులుగా పరిచయం చేస్కుంటారు. కానీ క్రీస్తును ప్రకటించరు, క్రీస్తును అనుసరించరు, క్రీస్తు బోధలని నమ్మరు, క్రీస్తును ఘనపరచరు. అడుగడుగునా వీరి బోధలతో క్రీస్తును అవమానిస్తూ క్రైస్తవులమని చెప్పుకునే మోసగాళ్ళు వీరు..

 

వీరి మూలాల్లోనికి వెళ్తే…. అమెరికాలో పెన్సిల్వేనియాకు చెందిన ఛార్లెస్ టెజ్ రస్సెల్ ఈ శాఖను 1879లో ప్రారంభించాడు. నిర్విరామంగా పనిచేస్తూ, వేలకొలదీ ప్రసంగాలు చేస్తూ తన శాఖను వేగంగా విస్తరింపజేసాడు. అనేక వాక్యాలను వక్రీకరిస్తూ వింత బోధలు చేసాడు. ప్రకటన 2,3 అధ్యాయాల్లో కనిపించే సంఘాలు సంఘ కాలాలనీ, సంఘ దూతలంటే ఒక్కో కాలానికి ఒక్కో సంస్కర్త అని, చివరి కాలానికి తానే దూతనని చెప్పుకున్నాడు. అందుకే అతని సమాధి పైన ‘లవొదికయ సంఘ దూత’ అని వ్రాయబడి ఉంటుంది.

 

ఇతడు మరణించాకా రూథర్ఫర్డ్ ఈ శాఖ బాధ్యతల్ని స్వీకరించాడు. వీరి హెడ్ క్వార్టర్స్లో 18 మంది సభ్యులు గల కమిటీ ఉంటుంది. వారంతా కలిసి ఎప్పటికప్పుడు కొత్త కొత్త దుర్బోధలతో మ్యాగజైన్లు, పుస్తకాలు తయారుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సాక్షుల శాఖలను పర్యవేక్షిస్తుంటారు. వీరి దుర్బోధలకి కొన్ని బైబిల్ వచనాలు ఆటంకంగా ఉన్నాయని వీరికి అనుకూలంగా ఉండే విధంగా ఒక కొత్త బైబిల్నున్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ (NWT) పేరుతో 1961లో విడుదల చేసారు. ప్రస్తుతం ఇది 181 భాషల్లో లభ్యమవుతుంది.

 

ລ້ວ ລ້…

 

వీళ్ళ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో దేవుడు, పరిశుద్ధాత్ముడు, అపొస్తలులు, శిష్యులు, విశ్వాసులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం అందరూ యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు (యోహా 5:32,37;8:18 & యోహా 18:38;14:6 & యోహా 15:26 & అపా 4:33:5:32 & 21:24 & 5 4:39 & ໙໖ 10:43 & 24:44; 5 5:45,46) 5 ລ້ ລ້ యెహోవాకు సాక్షులు.

 

వీరు ఈ భూమిపై ఎన్ని పాపాలు చేసినా శిక్ష ఉండదని బోధిస్తారు…

 

ఒక వ్యక్తికి, తాను ఈ లోకంలో బ్రతికి ఉండగా చేసిన క్రియల ఆధారంగా తీర్పు తీర్చబడదు అని, చనిపోయిన వారికి ఇక ఏ చలనం ఉండక సుప్తావస్తలో ఉండిపోతారని, పాతాళంలో ఎలాంటి బాధ, వేదన ఉండదని వీరు బోధిస్తారు. బ్రతికి ఉండగా ఎన్ని పాపాలు చేసినా, చనిపోయిన వెంటనే అతడు పాపవిముక్తుడయిపోతాడని వీరు బోధిస్తారు. ఇందుకు రోమా 6:7 మరియు ప్రసంగి 9:10 వచనాల్ని ఆధారంగా చూపుతారు. వెయ్యేండ్ల పాలనా సమయంలో దేవుడు విధేయులుగా జీవించిన వారిని శాశ్వతంగా భూమి మీద ఉంచుతాడని, ఆ కాలంలో తప్పు చేసిన వారిని అగ్ని గుండంలో వేస్తాడని, అగ్ని గుండంలో వెయ్యగానే వారు మరణిస్తారని, యుగయుగాలు బాధపడటం లాంటిదేదీ ఉండదని వీరు బోధిస్తా రు. అసలు నరకం అనేది ఒక అలంకార భాషా పదమని, మనుషుల్ని నిరంతరం బాధించడానికి దేవుడు క్రూరుడు కాదని కూడా బోధిస్తారు. ఈ బోధ చేస్తూ క్రైస్తవుల్ని పాపం చేయడానికి ప్రోత్సహిస్తున్నారు.

 

రోమా 6:7లో చనిపోయినవాడు పాపవిముక్తుడు అని వ్రాయబడి ఉంది. అయితే ఆ చనిపోవడం, శరీర సంబంధంగా చనిపోవడం కాదు. “పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఎలాగు దానిలో జీవించుదుము?  ఆయనతో సిలువ  వెయ్యబడెను. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు” (రోమా 6:2-11) ఎవరైతే పాపం విషయంలో చనిపోయి, బాప్తిస్మం తీసుకుంటాడో అతడు పాపవిముక్తుడు అవుతాడని ఈ వచనాలు స్పష్టంగా చెప్తుంటే, ఎంత పాపం చేసినా చనిపోయిన వెంటనే పాపాలు పోతాయని వీరు వాదించడం అజ్ఞానం.

 

ఇక ప్రసంగి 9:10 విషయానికొస్తే… చనిపోయిన వారికి చలనం ఉంటుంది. తప్పించుకునే మార్గం, ఉపాయము మాత్రము ఉండవు. ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధింపబడలేదా (లూకా 16:19-24)? యేసుక్రీస్తును అబ్రాహాము చూసి సంతోషించలేదా (యోహా 8:56)? పాతాళంలో ఏడుపు, పండ్లు కొరుకుట ఉందని ప్రభు చెప్పలేదా (మత్త 8:12)? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభు చెప్పలేదా (మార్కు 9:48)? చనిపోయిన వారికి చలనం అనేది లేకపోతే, అతడు మృతునిగానే ఉంటే, దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని ఎందుకంటాడు? ఆయన మృతులకు దేవుడా (మత్త 22:33)? ఒక వ్యక్తి తాను ఈ జీవితకాలంలో చేసిన క్రియలను బట్టే తీర్పు తీర్చబడతాడు (మత్త 25:35-39; రోమా 2:6,14,15; ప్రక : 14: 13;22:12). అతడు చనిపోయిన వెంటనే పాపపు క్రియలు గలవాడైతే పాతాళ వేదనలోనికి, పరిశుద్ధుడైతే పరదైసు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాడు. రెండు చోట్లా వారికి చలనం ఉంటుంది.

 

వీరు దేవుని రాజ్యం ఇంకా రాలేదు అని బోధిస్తారు….

 

దానియేలు 2:32-49 ప్రకారం బబులోను, మాదీయ పారశీక, గ్రీకు రాజ్యాల తరువాత ఏర్పడిన రోమా ప్రభుత్వ కాలంలో క్రీస్తు ద్వారా దేవుని రాజ్యం ప్రారంభమైంది. అది చిన్న రాయిగా ప్రారంభమయి సర్వభూతలమంతా వ్యాపించును అని వ్రాయబడినట్లు 12 మందితో   ప్రారంభమైన ఆయన రాజ్యం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకూ వ్యాపించింది. వాక్య మూలంగా, అత్మ మూలంగా జన్మించినవారంతా ఆ రాజ్యంలో ప్రజలే పెంతెకొస్తు రోజున స్థాపించబడిన సంఘమే దేవుని రాజ్యమని సువార్తలన్నీ స్పష్టంగా తెలియజేస్తున్నాయి (మత్త 16:18: 13:31-33,44-49,52; మత్త 7:13&లూకా 13:24-28; యోహా 3:5, 1పేరు 2:9) క్రీస్తు సింహాసనాసీనుడై ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు (మార్కు 16:19; 1 పేతు 3:22)

 

వీరు ప్రభుత్వాన్ని నిరాకరించమని బోధిస్తారు…

 

‘అధికారం దేవుని వలనే కలిగింది. ప్రతీ ప్రభుత్వ కట్టడలకి సంపూర్ణంగా లోబడండి. అధికారుల్ని నిరాకరించువాడు దేవునినే నిరాకరిస్తున్నాడు’ అని బైబిల్ చెప్తుంది (రోమా 13:1-7; తీతు 3: 1; 1 పేతురు 2:13-15) కానీ యెహోవా సాక్షులు, ప్రభుత్వాధికారం సాతాను వల్లనే కలిగిందని నమ్ముతారు, బోధిస్తారు. నీరు ‘ఓటు‘ వెయ్యరు. జాతీయ గీతాలను పాదరు, జెండా వందనాన్ని తిరస్కరిస్తారు.

 

వీరు రక్తదానం చెయ్యకూడదు. పొందకూడదు అని బోధిస్తారు…

 

యెహోవా సాక్షులు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడాన్ని మహా పాపంగా పరిగణిస్తారు. ప్రతీ సంవత్సరం కొన్ని వందల మంది   యెహోవా సాక్షులు రక్త మార్పిడిని నిరాకరించడం వలన ప్రాణాలు కోల్పోతు న్నారు. రక్తమే ప్రాణము కాబట్టి రక్తదానం చెయ్యడం నిషేధం అంటూ వీరు సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. రక్తమే ప్రాణం అనుకున్నా.. యేసుక్రీస్తు ప్రాణాధారమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించాడు. మనం కూడా ఒకరి కొరకు ఒకరుప్రాణాన్ని (రక్తాన్ని) పెట్టబద్ధులుగా ఉన్నాం.

 

వీరు ఈ భూమి శాశ్వతమైంది అని, త్వరలో ఈ భూమి పరదైనుగా మారిపోతుందని బోధిస్తారు…..

 

చనిపోయిన యెహోవా సాక్షులంతా పునరుత్థానులై భూపరదైసులో జీవిస్తారని వీరు నమ్ముతారు. పునరుత్థానమైనవారు మళ్ళీ వాళ్ళ కుటుంబాలతో కలిసి జీవిస్తారని, పిల్లల్ని కంటారని వీళ్ళు నమ్ముతారు. బైబిల్ వీరి నమ్మకాన్ని పూర్తిగా తప్పు అంటుంది. భూమి పరదైసువలె మారుతుందని బైబిల్లో ఒక్కచోట కూడా వ్రాయబడలేదు. పైగా ఈ భూమి శాశ్వతంగా ఉండదు అని పదే పదే వ్రాయబడింది. (యెష 65:17:66:22; 25 3:7; 5 20:11; 21:1)

 

వీరు రొట్టె మరియు ద్రాక్షరసాన్ని స్వీకరించకూడదని బోధిస్తారు….

 

యెహోవా సాక్షుల సమాజంలో రెండు గ్రూపులవారుంటారు. ఒకరు పరలోకానికి వెళ్ళడానికి నిశ్చయించుకొన్నవారు. ఇంకొకరు  త్వరలో పరదైసుగా మారబోతున్న భూమిపైన శాశ్వతంగా నివశింపగోరువారు. వీరిలో పరలోకానికి వెళ్ళాలనుకున్నవారే రొట్టె ద్రాక్షారసాన్ని స్వీకరిస్తారు. అది కూడా యూదులు పస్కా పండుగ జరుపుకునే రోజున అనగా సంవత్సరానికి ఒక్కసారే రొట్టె ద్రాక్షరసాల్ని స్వీకరిస్తారు. భూపరదైసు మీద ఉండాలనుకునేవారు ప్రభురాత్రి భోజనం రోజున చర్చికి వెళ్తారు కానీ స్వీకరించరు. కానీ ‘నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని | త్రాగువాడినే అంత్య దినాన లేపుతాను’ అని ప్రభు చెప్పాడు (యోహా 6:54) రొట్టె, ద్రాక్షరసం స్వీకరించనివాడికి నీతిమంతుల పునరుత్థానంలో పాలులేదని బైబిల్ చెప్తుంది (అపొ.కా. 2:46; 1కొరి 11:25,26).

 

వీరు పునరుత్థానం గతించిపోయింది అని బోధిస్తారు (2తిమో 2:18)

యెహోవా సాక్షుల స్థాపకుడైన ఛార్లెస్ రస్సెల్, 1914 అక్టోబరులో క్రీస్తు రెండవ రాకడ జరగబోతుంది అని ప్రకటించాడు. నేటి  యెహోవా సాక్షులంతా 1914లో రాకడ జరిగిపోయిందనే నమ్ముతారు. ఇందుకు రస్సెల్ ఒక వచనాన్ని ఆధారంగా చూపిస్తారు.

    దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక కల కంటాడు. అందులో ఒక చెట్టు మహా వృక్షమై నరికివేయబడుతుంది. ఏడు కాలాలపాటు ఆ చెట్టు నరకబడిన స్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ చిగురిస్తుంది. ఈ కలకి ఛార్లెస్ రస్సెల్ ఇలా అర్థమిచ్చాడు.

 

“ఏడు కాలాలు అనగా 7 సంవత్సరాలు. అనగా 7×360=2520 రోజులు. అయితే ఇవి రోజులు కావు, సంవత్సరాలు, రోజుకి ఒక సంవత్సరం చొప్పున 2520సం||లు. ఆ చెట్టు యెరూషలేము. యెరూషలేము 2520 సం||లు అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఆ ఏడు. కాలాలు పూర్తయిన రోజున పునరుత్థానం జరిగిపోయి దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది. 1914 అక్టోబర్కి ఈ గదువు పూర్తవుతుంది కాబట్టి క్రీస్తు రాకడ జరిగిపోతుంది.” ఇదీ వీరి వివరణ.

 

1914 అక్టోబర్లో యేసుక్రీస్తు రాబోతున్నాడు అని Watch tower మ్యాగజైన్ ప్రపంచమంతా పబ్లిసిటీ చేసింది. అక్టోబర్ 1914 రానే వచ్చింది. పునరుత్థానం జరగలేదు. యెరూషలేము ఇంకా అన్యుల చేతిలోనే ఉండిపోయింది. భూమిపై పరిశుద్ధులెవరూ ఎత్తబడలేదు. వెంటనే ఈ కావలికోటవారు మరో విచిత్రమైన ప్రకటనను విడుదల చేసారు. యేసుక్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయింది అనీ 1,33,000 | మంది చనిపోయిన పరిశుద్ధులు పరలోకం వెళ్ళిపోయారని ప్రకటించుకున్నారు.

 

నిజనిజాల్లోనికి వస్తే… దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు దర్శనం చూసి ఆ దర్శన భావం ఏంటని దానియేలును అడుగుతాడు. దానియేలు దేవుని ఆత్మ సహాయంతో ఆ దర్శన భావాన్ని చెప్తాడు. ‘ఆ చెట్టు నెబుకద్నెజరు … అతడు గర్వించగానే దేవుడతనిని తగ్గింది, రాజ్యాన్ని ఇంకొకరికి అప్పగిస్తాడు. ఏదు సంవత్సరాలు నెబుకద్నెజరు అడవి జంతువువలే గడ్డి మేస్తాడు. ఆ తర్వాత అతనికి బుద్ధి వచ్చాకా మళ్ళీ రాజ్యాన్ని పొందుతాడు‘. ఇదీ దానియేలు చెప్పిన కల భావం. నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో కల కంటే, అదే అధ్యాయంలో కల | భావం వివరించబడిపోయింది. అదే అధ్యాయంలో ఆ కల నెరవేరిపోయింది కూడా. బైబిల్ గూర్చి సాదా సీదా జ్ఞానం ఉన్నవాళ్ళకి కూడా ఈ విషయం అర్థమయిపోతుంది. మాకు మాత్రమే బైబిల్ జ్ఞానముంది అని చెప్పుకునే యెహోవా సాక్షులకి మాత్రం అర్ధం కాలేదు.

 

1914 అక్టోబర్లో మృతుల పురుత్థానం అదృశ్యంగా జరిగిపోయింది అని వీరు ప్రకటిస్తున్నారు కానీ బైబిల్ ఇలా చెప్తుంది…

“క్రీస్తు వచ్చినపుడు ప్రభునందు మృతినొందినవారు మొదట లేతురు. ఆ మీదట రెప్పపాటులోనే సజీవులైన పరిశుద్ధ క్రైస్తవులంతా శరీరాలు మార్చుకుని మృతులనుండి పునరుత్థానమైన వారితో కూడా ఏకమై ప్రభుని ఎదుర్కొంటారు” (1కొరి 15:52, 1థెస్స 4:16,17) చనిపోయిన పరిశుద్ధుల పునరుత్థానానికి, బ్రతికి ఉన్న పరిశుద్ధులు ఎత్తబడటానికి మధ్య రెప్పపాటు సమయం మాత్రమే ఉంటుంది. పైగా  బ్రతికి ఉన్న పరిశుద్ధులు కూడా ఏకమైన తర్వాతే పునరుత్థానమైనవారు ప్రభుని కలుసుకుని పరలోకంలో ప్రవేశిస్తారు:

 

వీరు పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారని బోధిస్తారు…

 

అయితే పునరుత్థానులైనవారి సంఖ్యను గూర్చి బైబిల్ “వేవేల పరిశుద్ధులు” అని చెప్తుంది (యూదా 15) “నేను చూడగా ఇదిగో ప్రతీ జనములోనుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు ఆయా భాషలు మాట్లాడువారిలోనుండియు వచ్చి ఎవరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము” (ప్రక 7:9) కూడా పరలోకంలో ప్రవేశించారు.

 

పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే అని వీరు బోధిస్తారు…

 

పరిశుద్దాత్ముడు ఆదరణకర్త అని, ఆయన మనలో నివశిస్తాడు అని, ఆయన మనల్ని ఒప్పిస్తాదని, నడిపిస్తాడని, బోధిస్తాడని, హెచ్చరిస్తాడని, మనతో ప్రార్ధన చేయిస్తాడని, ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే దుఃఖపడతాడని బైబిల్ చెప్తుంది (యోహా 14:16, 16:11; రోమా 8:26; ఎఫె 4:30) పరిశుద్ధాత్ముడు ‘మహిమా స్వరూపి’ అని, ‘దేవుడు’ అని కూడా వ్రాయబడింది (అపొ 5:3-5; 1 పేతు 4:14) పరిశుద్ధాత్ముడు. ‘అబ్బా తండ్రి‘ అంటూ మనలోనుండి మన పక్షంగా ప్రార్ధించే దేవుని కుమారుని ఆత్మ (గలతీ 4:6), అందుకే ప్రభువే ఆత్మ అని 2కొరి | 3:17లో వ్రాయబడింది. వీటన్నింటిని బట్టి ఆయన ఒక శక్తి కలిగిన వ్యక్తి అని ఎవరికైనా అర్ధమవుతుంది. ‘గ్రీకులో పరిశుద్ధాత్మకు మూడవ లింగమైన (Nutrol) ‘అది’ అని ఉపయోగించబడింది కాబట్టి ఆత్మ ఒక శక్తి మాత్రమే’ అనేది వీరి వాదన. గ్రీకులో చిన్న బిడ్డను కూడా ‘అది’ అనే వాడతారు. అంత మాత్రాన బిడ్డ ఒక వస్తువు లేక పదార్థం అయిపోతుందా? దయ్యాన్ని లేక ఆత్మను కూడా అది అనే వ్రాయబడుతుంది (మత్త 12:43,44) దయ్యం ఒక శక్తి మాత్రమే అనవచ్చా? అయితే సాతాను కూడా వ్యక్తి కాదా? పరిశుద్ధాత్ముడు ‘ఆత్మ’ కాబట్టి గ్రీకులో ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది. కానీ వీరు మాత్రం, పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి మాత్రమే అని బోధిస్తూ దేవుని ఆత్మని ఘోరంగా దూషిస్తారు. అందుకే వీళ్ళకు దేవుడు ఏ విధమైన ఆత్మవరాలను అనుగ్రహించడంలేదు. అందుకని ఆత్మ వరాలు అపొస్తలులతోనే ముగిసిపోయాయి. అని ప్రకటించేసుకున్నారు.

 

క్రీస్తు సిలువ మీద చనిపోలేదు అని వీరు బోధిస్తారు….

 

‘అందరూ అనుకుంటున్నట్లు క్రీస్తు సిలువ మీద చనిపోలేదు. ఒక మ్రాను మీద వ్రేలాడదీయబడి చనిపోయాడు’ అనేది వీరి వాదన. మ్రాను మీద చనిపోయినవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది కాబట్టి యేసు చనిపోయింది మ్రానుమీదనే అని వాదిస్తారు.

 

యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడని క్రొత్త నిబంధనలో 65 సార్లు వ్రాయబడింది. మ్రాను మీద చనిపోయాడని 5 సార్లు వ్రాయబడింది. ‘సిలువ’ అని తర్జుమా చేయబడిన చోట stauros అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. ‘stauros అనగా a combination of two wodden beams. అంటే రెండు చెక్కలతో చెయ్యబడిన ఒక వస్తువు అని అర్థం. సిలువ చెక్కుతో చెయ్యబడిన వస్తువే కదా. యేసుక్రీస్తు,   మ్రాను మీద చనిపోవాలి అనేది ప్రవచనం. మాను అనే చోట xulon అనే గ్రీకు పదం వ్రాయబడింది. xulon అనగా a wooden artical (or) that which is made of wood. అంటే చెక్కతో చెయ్యబడిన ఒక వస్తువు అని అర్ధం. ఆయన సింహాలకి వెయ్యబడలేదు. అగ్నికి ఆహుతి చెయ్యబడలేదు. చెక్క (చెక్కతో చెయ్యబడిన సిలువ) మీదే చనిపోయాడు..

 

యేసుక్రీస్తు చేతులలో ‘మేకుల’ గుర్తులు ఉన్నాయి (యోహాను 20:25). అంటే రెండు చేతులలో రెండు మేకులు వెయ్యబడ్డాయి. నిలువు మ్రాను మీద వ్రేలాడదీస్తే రెండు చేతులలో కలిపి ఒక మేకే వెయ్యడానికి కుదురుతుందికానీ రెండు మేకులు ఎలా వేస్తారు?

 

వీరు యేసుక్రీస్తు శరీరంతో పునరుత్థానం అవలేదు అని బోధిస్తారు....

 

క్రీస్తు శరీరంతో పునరుత్థానం అవకపోతే క్రైస్తవుల విశ్వాసమే వ్యర్ధమని బైబిల్ చెప్తుంది (1కొరి 15:14). వీరు పైకి క్రైస్తవులుగా చెలామణి అవుతూ క్రైస్తవ విశ్వాసాన్నే తప్పు త్రోవలో నడిపిస్తున్నారు. క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదని, ఆయన శరీరంతో సమాధిలో నుండి బయటికి వచ్చాడని, ఆయనను అనేకులు చూసారని, ఆయన పాదాలు పట్టుకున్నారని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. క్రీస్తు తన గాయాల్ని శిష్యులకు చూపాడు కూడా (మత్త 28:1,2,9; మార్కు 16:9-12; యోహా 20:2,25, అపొ.కా. 2:31), నావలె ‘ఆత్మకి’ మాంసం, ఎముకలు ఉండవు అని యేసే స్వయంగా చెప్పాడు (లూకా 24:39), క్రీస్తు శరీరంతో పునరుత్థానుడయ్యాడని బైబిలు, అపొస్తలులు, నాటి శిష్యులు సాక్షులుగా ఉంటే (అపొ.కా. 2:32), క్రీస్తు శరీరంతో లేవలేదని నేటి యెహోవా సాక్షులు ప్రకటిస్తున్నారు. క్రీస్తు శరీరం లేపబడకపోతే సమాధిలో ఆయన శరీరం ఏమయింది? శరీరంతో లేవనపుడు సమాధి తెరవబడాల్సిన అవసరం ఏంటి? శరీరం లేకపోతే ఆయనను ఎలా తాకుతారు? ఎలా చూస్తారు? బైబిల్లో ‘క్రీస్తు, శరీర విషయంలో చనిపోయి ఆత్మచేత లేపబడ్డాడు’ (1పేతు 3:18) అనే వచనం క్రీస్తు శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో లేపబడ్డాడు’ అని పొరపాటుగా తర్జుమా చెయ్యబడింది.

 

వీరు యేసుక్రీస్తును మిఖాయేలు దేవదూత అంటారు….

 

దేవునిని తప్ప ఇంకెవరినీ ఆరాధించకూడదని క్రొత్త నిబంధన చెప్తుంది. క్రొత్త నిబంధన భక్తులంతా అలాగే చేసారు. పరలోకంలో దేవదూతలు కూడా తమకి ఎవరైనా మ్రొక్కుతుంటే వారిని అడ్డగించి దేవునిని మాత్రమే ఆరాధించండి అని చెప్పారు (మత్త 4:10; లూకా 4:8; అపొ.కా. 10:25,26; ప్రకటన 22:8,9), కానీ యేసుక్రీస్తు విషయంలో, ఆయన రెండవసారి భూమిపై ప్రత్యక్షమైనపుడు దేవదూతలంతా (మిఖాయేలుతో సహా) ప్రభువును ఆరాధించాలని వ్రాయబడింది (హెబ్రీ 1:6), కానీ ఈ యెహోవా సాక్షులు, యేసుక్రీస్తే మిఖాయేలు దేవదూత అని బోధిస్తుంటారు. బైబిల్ అంతటిలో ఒక్క వచనం కూడా అలా చెప్పనప్పటికీ వీరు అలాగే బోధిస్తారు. యేసుక్రీస్తును కించపరచడమే వీరి ప్రధాన లక్ష్యం. యేసుక్రీస్తు దేవదూత కాదు… దేవదూతలకంటే అతి శ్రేష్ఠుడు (హెబ్రీ 1:4).

 

వీరు యేసుక్రీస్తును దేవుడు కాదు అని బోధిస్తారు….

 

యెహోవా సాక్షుల పుస్తకాల్లో, మ్యాగజైన్లో, కరపత్రికల్లో యేసుక్రీస్తు ఫోటోలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వీరి లక్ష్యమంతా క్రీస్తును కించపరచడమే. యేసుక్రీస్తు దేవుడు కాడని, ఆయనను ఆరాధించకూడదని, ఆయన ఒక ఆత్మ ప్రాణి మాత్రమే అని యెహోవా సాక్షులు బోధిస్తారు. యేసుక్రీస్తు తనని తాను దేవుడనని ఎక్కడా చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాడు అని వాదిస్తారు. వీరు క్రీస్తువిరోధి ఆత్మచేత నడిపించబడువారు కాబట్టే వీరి బోధలన్నీ క్రీస్తుకు విరోధంగా ఉంటాయి.

 

యోహాను 1:1. “ఆదియందు వాక్యముండెను… వాక్యము దేవుడైయుండెను” అని వ్రాయబడిన ఈ వచనాన్ని వీరి న్యూ వరల్డ్ ట్రాన్స్ లేషన్ (NWT) బైబిల్ లో ‘ఆదియందు వాక్యముండెను… వాక్యము ఒక దేవుడైయుండెను’ అని తప్పుగా తర్జుమా చేసారు.

 

బైబిల్ స్పష్టంగా యేసుక్రీస్తును దేవుడు అంటుంది.

 

దేవుడైయున్న వాక్యము యొక్క శారీరక అవతారమే యేసుక్రీస్తు.. (యోహా 1:1,14)

 

శరీరముతో ప్రత్యక్షమైన దేవుడే యేసుక్రీస్తు.. (1తిమో 3:16)

 

దేవుడు అని పిలువబడిన దైవకుమారుడే యేసుక్రీస్తు.. (హెబ్రీ 1:8)

 

కనిపించని దేవునికి దృశ్యరూపమే యేసుక్రీస్తు... (కొలొ 1:15; 25రి 4:4)

 

 దేవత్వమంతా నివశించే శరీరమే యేసుక్రీస్తు.. (కొలొ 2:9)

 

ఏక కాలంలో ప్రతీ స్థలములోనూ ఉండువాడే యేసుక్రీస్తు.. (మత్త 18:20) యెషయా 9:6లో యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు అని, తీతు 2:13లో ఆయన మహా దేవుడు అని వ్రాయబడింది.

 

వీరి మరికొన్ని వింత బోధలు....

 

1918లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయితే ఆ యుధ్ధమే హార్మెగిట్టోను యుద్ధమని ప్రకటించారు. కానీ హార్మెగిట్టోను యుద్ధాన్ని గూర్చి బైబిల్ చెప్పిన ఏ సంగతులు అప్పుడు జరగలేదు. తరువాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయినపుడు కూడా ఇదే హార్మెగిడోను యుద్ధం అని ప్రకటించారు. 1975లో భూమి అంతమయిపోతుందని ధృడంగా ప్రకటించారు. ఇది నమ్మిన చాలా మంది తమ ఆస్తుల్ని అమ్మేసుకుని యెహోవా సాక్షులకి ఇచ్చేసారు. కానీ 1975లో వీరు చెప్పిన ప్రవచనం నెరవేరలేదు. దానితో చాలా మంది ఈ శాఖని విడిచిపెట్టేసారు. ఇంకొంత కాలానికి ఈ భూమి ఇక నాశనమే అవదు అని ప్రకటించారు. ఎవరైనా ఒక ప్రవచనం చెప్తే, అది కనుక జరుగకపోతే ఆ చెప్పిన వ్యక్తి ‘అబద్ధ ప్రవక్త’ అని బైబిల్ చెప్తుంది (యిర్మీ 29:9) యెహోవా సాక్షులు ఒక అబద్ధ ప్రవక్తల సమూహం.

 

ఆదామును మొదటి ఫరో అంటారు. మొదటి పిరమిడ్ను మొల్కీసెదెకు నిర్మించాడు అంటారు. మద్యాన్ని పార్టీలలో త్రాగవచ్చు, మితంగా త్రాగవచ్చు అని బోధిస్తారు. దేవుని నుండి స్వస్థత వస్తుంది అని వీరు నమ్మరు. వారు కూడుకునే చోటును ‘చర్చ్’ అనరు. దానిని యెహోవా సాక్షుల రాజ్యమందిరం అంటారు. వీరికి పాస్టర్లు ఉండరు. మిలటరీలో పనిచెయ్యకూడదు అంటారు. రాజకీయాల్లో పాల్గొనకూడదు అంటారు. ఒకవేళ ఒక దేశం అంతా యెహోవా సాక్షులుగా మారిపోతే వారి దేశాన్ని ఎవరు కాపలా కాస్తారు? వారిని ఎవరు పరిపాలిస్తారు?

 

ఇంకా ఇలాంటి బోధలు మరెన్నో… వీరు సంవత్సరానికి 80,000 క్రైస్తవుల్ని యెహోవా సాక్షులుగా మారుస్తున్నాం అని వీరు అధికారికంగా ప్రకటించారు.




Scroll to Top