fightoncults.com

క్రీస్తువిరోధి ఆత్మ

అపవాది అనేక రకాలుగా ఈ లోకంలో పనిచేస్తాడు. అపవిత్రాత్మ, మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, దాస్యపు ఆత్మ ఇలా రకరకాల పేర్లతో వాడి క్రియలను గూర్చి బైబిల్ వివరిస్తుంది… ఆదిమ సంఘ కాలంలో ప్రారంభమైన వీడి మరో క్రియ “క్రీస్తువిరోధి ఆత్మ” (1యోహా 4:2,3). యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేయటమే దీని లక్ష్యం.

 

క్రీస్తువిరోధి ఆత్మ చేసే పనులు…

 

1) క్రీస్తువిరోధి ఆత్మ, కొందరిని ప్రేరేపించి క్రీస్తు మీద అనేక నిందలు మోపించి, అన్యజనులు సువార్తను తిరస్కరించేలా చేస్తుంది. క్రీస్తు సువార్త ప్రకాశం వారికి అందకుండా వారి కన్నులకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది (2కొరి 4:4).

 

2) తండ్రిని కుమారునిని ఒప్పుకొనని వాడే క్రీస్తువిరోధి (1యోహా 2:22),

 

జుడాయిజం వంటి శాఖలవారు తండ్రిని ఒప్పుకొంటారు కాని క్రీస్తును ఒప్పుకోరు. ఆయనను విశ్వసించరు. యేసుక్రీస్తు గూర్చి బైబిల్ చెప్తున్న ప్రతీ విషయాన్ని మనం నమ్మాలి. కాని వీరు కొన్ని నమ్ముతారు కొన్ని నమ్మరు. అందుకే వీరు క్రీస్తువిరోధి ఆత్మగలవారు….

 

3) క్రీస్తు శరీరధారిగా రాలేదు అనేవారు క్రీస్తువిరోధి ఆత్మగలవారు (1యోహా :2,3), క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అన

 

ఒప్పుకోవడం అంటే ఆయనకి ఇంతకు ముందు శరీరం లేదని ఒప్పుకోవడం. ఇంతకు ముందు శరీరం లేదు అని ఒప్పుకోవడమంటే ఆదియందు ఆయన వాక్యమైయున్నాడని ఒప్పుకోవడం. ఆయన ‘వాక్యము’ అని ఒప్పుకోవడమంటే ఆయన ‘దేవుడు’ అని ఒప్పుకోవడం (యోహా 1:1,14). కానీ ప్రస్తుతం అనేక ప్రొటెస్టంట్ శాఖలవారు యేసుక్రీస్తును దేవుడు కాడు అంటున్నారు. ఆదియందు వాక్యమైయున్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్మని ప్రతీవాడు క్రీస్తువిరోధే..

 

అపవాది క్రీస్తువిరోధిగా పనిచేస్తూ, లక్షల మందిని ప్రేరేపిస్తూ, కోట్ల మందిని క్రీస్తు విషయంలో అభ్యంతరాలకు గురి అయ్యేవారిగా మార్చేసాడు. వాడి బోధల్ని ఒకసారి పరిశీలిద్దాం..

 

యేసుక్రీస్తును గూర్చి ప్రవచనాలు లేవా…?

 

యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం ప్రవచనసారం అని బైబిల్ చెప్తుంటే కొందరు క్రీస్తువిరోధులు అసలు ఆయన గూర్చి ఒక్క ప్రవచనం కూడా లేదని, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు అని బోధించేవి అసలు ప్రవచనాలు కావని వాదిస్తుంటారు.

 

బైబిల్లో ప్రవచనాలు ఈ విధంగా ఉంటాయి.

 

  1. ఒక సందర్భం కోసం సూటిగా చెప్పబడే ప్రవచనాలు.. ఉదా: అబ్రాహాముకి కుమారుడు పుడతాడు, ఇస్సాకు అని అతనికి పేరు పెట్టుము (అది 17:19) 2. కీర్తన రాయబడుతున్నపుడు మధ్యలో రాయబడిన ప్రవచనాలు. ఉదా: కీర్తన 90:3లో రెండవ రాకడను గూర్చి ప్రవచించబడింది. 3. పేర్లు మార్చి చెప్పబడే ప్రవచనాలు.. ఉదా: ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును (మలాకీ 4:6), కానీ నెరవేర్పులో అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను (లూకా 1:14-17, 63) 4. ఒక పట్టణం కోసమో, ప్రజల కోసమో చెబుతుండగా దానితో కలిపి చెప్పబడే ప్రవచనాలు.. ఉదా: యెహె 28:11-17లో తూరు రాజును గూర్చి అని చెబుతూ అపవాదిని గూర్చి చెప్పబడింది.

 

  1. అలంకార భాషలో రాయబడే ప్రవచనాలు.. ఉదా: యెష 26:21లో సంఘం పరదైసుకు వెళ్ళడాన్ని అంతఃపురంలోనికి అంటూ అలంకారభాషలో చెప్పబడింది.

 

యెహోవా గ్రంధాన్ని పరిశీలించి చదవడం ద్వారా మాత్రమే ప్రవచనాలను గుర్తించగలం (యెష 34:16), క్రీస్తువిరోధులు బైబిల్లో తప్పులు వెదకడానికి బైబిల్ చదువుతారు కాబట్టి వారు ప్రవచనాలను గుర్తించలేరు. బైబిల్ నియమాలను బట్టి ప్రవచనాలను గుర్తించగలిగితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన ప్రతీ అంశం ముందుగానే ప్రవచించబడింది.

 

(1) యేసుక్రీస్తు రోమా ప్రభుత్వకాలంలో జన్మిస్తాడు (దాని 2:39-44 = లూకా 3:1,2) (2) ఆయన మానవ ప్రమేయం లేకుండా జన్మిస్తాడు (దాని 2:34 = లూకా 1:35) (3) ఆయన లేవీయులలో జన్మించడు (ద్వితీ 18:18 = హెబ్రీ 7:13), (4) ఆయన యూదా గోత్రంలో జన్మిస్తాడు (ఆది 49:8 = మత్త 1:2,3), (5) ఆయన దావీదు వంశంలో జన్మిస్తాడు (యిర్మీ 23:5 = మత్త 1:6,7) (6) ఆయన బెత్లహేములో జన్మిస్తాడు (మీకా 5:2 = లూకా 2:5) (7) ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది (సంఖ్యా 24:17 = మత్త 2:2) (8) ఆయన జన్మించినపుడు స్థలం దొరకక రాత్రి వేళ వీధులలో స్థలం కోసం వెదుకుతారు (యిర్మీ 14:8 = లూకా 2:7), (9) ఆయన బాలునిగా ఉన్నపుడు కొందరు ఆయనని దర్శించి బంగారం, ఇతర సుగంధద్రవ్యాలు ఇస్తారు (యెష 60:6 = మత్త 2:10,11) (10) ఆయన బాల్యంలో ఐగుప్తుకు వెళ్తాడు (హోషే 11:1 = మత్త 2:14,15), (11) ఆయన బాల్యంలో ప్రాణప్రమాదం ఏర్పడుతుంది. (యిర్మీ 31:16 = మత్త 2:17), (12) ఆయన పరిచర్యకు ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఆయనకి మార్గాన్ని సరాళం చేస్తాడు (యెష 40:3,4 = మత్త 3:1,2) (13) యేసుక్రీస్తు సువార్త ప్రారంభించి ఒక మార్గాన్ని స్థాపిస్తాడు (యెష 35:8 = యోహా 14:6), (14) ఆయన పరిచర్యలో స్వస్థతలూ ఆశ్చర్య కార్యాలు ఉంటాయి (యెష 35:5 = మత్త 4:24), (15) ఆయన తన ప్రజలతో ప్రేమగా బోధిస్తాడు (హోషే 2:14 = మార్కు 6:34), (16) ఆయన తన బోధలో ఉపమానాలు వాడతాడు (కీర్త 78:2 = మత్త 13:35), (17) ఆయనని తన ప్రజలు నిరాకరిస్తారు (యెష 53:3 = లూకా 23:16,17), (18) ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు (కీర్త 2:3 = మత్త 12:14) (19) ఆయన చివరిసారి యెరూషలేముకు వచ్చినపుడు హఠాత్తుగా ఆలయంలోనికి చొరబడతాడు (మలా 3:1 = యోహా 2:14,15). (20) ఆయన తన ప్రజలతో నిబంధన చేస్తాడు (యెష 49:8 మత్త 26:28), (21) ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనని ముప్పయి వెండినాణాలకు అప్పగిస్తాడు (జెక 11:13 = మత్త 27:15), (22) ఆయన శిష్యులు ఆయనని వదిలి పారిపోతారు (జెక 13:7 = మత్త 26:56), (23) ఆయనను పట్టుకొనేటప్పటికి అయన శిష్యుల వద్ద ఆయుధాలుంటాయి (యెష 53:12 = లూకా 22:37+ (24) ఆయనను మ్రాను మీద చంపుతారు (ద్వితీ 21:22 = మత్త 27:31,50) (25) ఆయన చేతులలో పొడుస్తారు (కీర్త 22:16 – యోహా 20:25). (26) ఆయన వస్త్రాన్ని పంచుకుంటారు (కీర్త 22:18=మత్త 27:35), (27) ఆయన యెరూషలేములోనికి గాడిదపై వస్తాడు (జెక 9:9 = మత్త 21:5) (28) ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరువబడదు (కీర్త 34:20- యోహా 19:36), (29) ఆయనతో ఉన్నవాడే ఆయనను అప్పగిస్తాడు (కీర్త 41:9 = మార్కు 14:43,44) (30) ఆయనకు చేదు చిరకను ఇచ్చిరి (కీర్త 69:21 = యోహా 19:30) (31) ఆయన రొట్టె, ద్రాక్షరసాలను ఇస్తాడు (ఆది 14:18 = మత్త 26:26-28) (32) ఆయన ధనవంతుని సమాధిలో పెట్టబడతాడు (యెష 53:9= మత్త 27:67-60), (33) ఆయన పునరుత్థానుడవుతాడు (యెష 53:9,10 – మత్త 28:6), (34) ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును (దాని 9:24 =మత్త 26:28), (35) ఆయన శరీరం కుళ్ళిపోదు ఆయన ఆత్మ పాతాళంలో బంధించబడదు (కీర్త 16:10 = 24:39). (36) ລ້ ລ້ ( 68:18 = 24:51; 2 4:8) (37) మేఘారూఢుడై వస్తాడు (ద్వితీ 33:26 = మత్త 24:30), (38) ఆయన వచ్చినపుడు ఆయనతో పరిశుద్ధులందరూ వస్తారు (జెక 14:5 = (ప్రక 19:13-15), (39) అటు తరువాత 1000సం భూమిని ఆయన పరిపాలిస్తాడు (యెష 24:23; ఒక 14:9 – ప్రక 20:4), (40) ఆయన ద్వారా అన్యజనులు రక్షించబడుదురు (హోషే 2:23-రోమా 15:18,19)

 

యేసుక్రీస్తు తనని తాను దేవుడు అని చెప్పుకోలేదా?

 

యేసుక్రీస్తు ‘నేను దేవుడిని’ అని చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాడు అని క్రీస్తువిరోధి ఆత్మ గలవారు వాదిస్తుంటారు. అయితే ‘నేను దేవుడిని’ అని చెప్పుకున్న వారంతా దేవుళ్ళు అని వీరు నమ్ముతారా? దేవుడు అని పిలవబడటానికి అన్ని విధాలా అర్హుడైనవాడు తాను దేవుడని చెప్పుకున్నా దేవుడే, చెప్పుకోకపోయినా దేవుడే. యేసుక్రీస్తు దేవుడని పిలవబడటానికి అర్హుడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. పరిశుద్ధుడు. ఆది, అంతము అయినవాడు (ప్రక 1:8).

 

యేసుక్రీస్తు తాను దేవుడను అని సుమారు 60 సార్లు చెప్పుకున్నాడు.

 

‘నేను దేవాలయము కంటే గొప్పవాడను’ అన్నాడు (మత్త 12:6). దేవాలయం కంటే గొప్పవాడెవరు? పూజారా? ధర్మకర్తా? దేవుడా? నిస్సందేహంగా దేవాలయం కంటే గొప్పవాడు దేవుడే.

 

‘నేను మనుష్యకుమారుడను’ అన్నాడు. మనుష్యకుమారుడు అంటే అర్ధం ఏంటి?

 

  1. 1. యెషయా 9:6 లో “ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను” అని యేసుక్రీస్తు గూర్చి ప్రవచించబడింది. ఆ కుమారునికి గల పేర్లు కూడా అక్కడే వ్రాయబడ్డాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త.

 

‘మనకు’ అనగా మానవజాతికి, యేసు మనుషులందరి కొరకు పుట్టిన కుమారుడు. అందుకే ఆయన తనను తాను మనుష్యకుమారుడు అని చెప్పుకున్నాడు. మనుష్యకుమారుడనగా ఆశ్చర్యకరుడు.. మనుష్యకుమారుడనగా బలవంతుడైన దేవుడు. యేసు తనని తాను మనుష్యకుమారుడు అని 60 సార్లు చెప్పుకున్నాడు. అంటే 60 సార్లు “నేనే దేవుడను‘ అని చెప్పుకున్నాడు.

 

యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్ధన చెయ్యకూడదా..?

 

క్రీస్తువిరోధి ఆత్మ ఎప్పుడూ క్రీస్తును తగ్గించడానికే ప్రయత్నిస్తుంది. అందుకే ‘యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్ధించాలి కానీ యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్థిస్తే ప్రయోజనం ఉండదు’ అనే బోధను సృష్టించింది. కానీ యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్ధించకూడదు అని క్రొత్తనిబంధన అంతటిలో ఒక్కసారి కూడా రాయబడలేదు. పైగా…

 

  1. ‘నాకు ప్రార్ధించండి’ అని యేసుక్రీస్తు చెప్పాడు.. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును (యోహాను 14:14), నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట యేల? (లూకా 6:46)

 

  1. అపొస్తలులు, శిష్యులు యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్ధించారు.. అపొ 7:59లో స్తెఫను, అపా 9:6-14లో అననీయ, 15రిం 16:22 మరియు 2కొరిం 12:8,9లో పౌలు, ప్రక 22:20లో యోహాను నేరుగా యేసుక్రీస్తుకు ప్రార్ధించారు.

 

  1. ఆదిమ సంఘమంతా యేసుక్రీస్తుకు ప్రార్ధించారని 15రి 1:2లో వ్రాయబడింది.

 

యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్ధించవచ్చని ఇన్ని వచనాలు చెబుతున్నా ఎవరైనా నేరుగా ప్రభువుకు ప్రార్ధిస్తుంటే దాన్ని తప్పంటాం. ‘యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ’ అని ఒక చోట కూడా రాయబడకపోయినా, ఒక భక్తుడు కూడా తన ప్రార్ధన ముగింపులో ఆ మాట వాడకపోయినా ఎవరైనా ఆ పదం వాడి ప్రార్ధన ముగించకపోతే అది ప్రార్ధనే కాదంటాం.. (తండ్రికి ప్రార్థిస్తూ ‘యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ’ అని ముగించడం వాక్యానుసారమే).



నేడు చాలా మంది తమ సంఘాలకి క్రీస్తు పేరు పెట్టుకుంటున్నారు కానీ క్రీస్తును అన్ని విషయములలోనూ తగ్గించేస్తున్నారు. క్రీస్తువిరోధి ఆత్మ ఎంతో సులువుగా క్రైస్తవులనే క్రీస్తుకు విరోధంగా త్రిప్పేసాడు.

 

యేసుక్రీస్తును నేరుగా ఆరాధించకూడదా?

 

చాలా శాఖలవారు యేసుక్రీస్తు ఆరాధించబడటానికి యోగ్యుడు కాడని, యేసు ద్వారా తండ్రిని మహిమపరచాలికానీ యేసుక్రీస్తును నేరుగా ఆరాధించకూడదు అని నమ్ముతారు.

 

కానీ… 1) యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించకముందే ఆయనను ఆరాధించాలి అని దానియేల

7:13,14లో ఆజ్ఞాపించబడింది.. 2) యేసుక్రీస్తు, నన్ను సేవించండి అని చెప్పాడు (యోహా 12:26). 3) యేసుక్రీస్తు శరీరధారిగా భూమిమీద ఉన్నప్పుడు అనేకమంది చేత ఆరాధించబడ్డాడు (మత్త 2:10,11; 82; 9:18; 14:33:28:9,17; యోహా 9:38), 4) పరలోకంలో కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు.ప్రక 5:7-9) 5) రాకడ తర్వాత పునరుత్థానులైన పరిశుద్ధుల చేత ఆరాధింపబడబోతున్నాడు (ప్రక 5:7-10; 7:9-12).

 

 ఆత్మ ప్రేరణతో రాయబడిన అనేక పాటలు క్రీస్తును ఆరాధించేవిగా ఉన్నాయి. ఆత్మచేత నింపబడిన అనేకులు వారికి తెలియకుండానే యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెబుతూ ఆరాధిస్తారు. అందుకు కారణం ఆత్మకు సిద్ధాంతాలు లేవు.

 

.

యేసుక్రీస్తు దేవుని కన్నా తక్కువవాడా..?

 

మనం ముందుగా చూచినట్లు క్రీస్తువిరోధి ఆత్మ యొక్క ప్రధాన లక్ష్యం యేసుక్రీస్తును తగ్గించడమే క్రైస్తవులలో చాలా మంది ఈ ఆత్మ చేత మోసపోయి తమకి తెలియకుండానే యేసుక్రీస్తును యెహోవాకన్నా తక్కువ స్థాయిలో చూస్తున్నారు. మనం పెట్టుకున్న కొన్ని సిద్ధాంతాలు కూడా యేసుక్రీస్తును రెండవ వాడిగా భావించడానికి కారణమవుతున్నాయి.

 

యేసుక్రీస్తు ‘తండ్రిని ఘనపరచినట్లుగా అందరునూ కుమారుని ఘనపరచవలెను’ (యోహాను 5:23) అని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని ఎందరో క్రైస్తవులు అంగీకరించలేక పోతున్నారు.

 

ఆయన దేవుడు (తీతు 2:13; యోహా 1:1,14,18 (ఫుట్ నోట్), 1తిమో 3:16; హెబ్రీ 1:8; కొలొ 1:15, 2:9; 1థెస్స 3:12+4:14; ఫిలి 2:6; రోమా 9:5; 2కొరి 4:4; అపా.కా 20:28), దేవుని కుమారుడు (యోహా 9:35-37), మనుష్యకుమారుడు (మత్త 17:9), నరుడు (1తిమో 2:5), ప్రవక్త (యోహా 4:44), స్నేహితుడు (యోహా 15:15), తండ్రి (యోహా 13:33), బోధకుడు (మత్త 23:8), గురువు (మత్త 23:10), సహోదరుడు (యోహా 20:17), మెస్సయ్య (యోహా 4:25,26), అపోస్తలుడు (హెబ్రీ 3:1), ప్రధాన యాజకుడు (హెబ్రీ 7:22-24), మధ్యవర్తి (1తిమో 2:5), ఉత్తరవాది (1 యోహా 2:1), రాజు (యోహా 18:37), కాపరి (యోహా 10:11), విమోచకుడు (మార్కు 10:45). ఇంకా ఎన్నో..

 

ఆయన నరునిగా మాట్లాడేటప్పుడు నాకొక దేవుడు ఉన్నాడు అంటాడు. కుమారునిగా మాట్లాడేటప్పుడు తండ్రి నాకన్నా గొప్పవాడు అంటాడు. గురువుగా మాట్లాడేటప్పుడు అధికారంతో బోధిస్తాడు. ప్రవక్తగా మాట్లాడేటప్పుడు భవిష్యత్ కోసం చెబుతాడు. ఇలా అనేక బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇప్పుడు పరలోకంలో యాజకునిగా, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఏదో ఒక కోణంలో క్రీస్తును చూచి ఈయన ఇది మాత్రమే అనడం అజ్ఞానం.

 

ఈ అంత్యదినాల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాడు అని బోధించే బైబిల్ కాలేజి ప్రొఫెసర్లు, బైబిల్ జ్ఞానులు వచ్చారు. దేవుని కుమారుడంటే దేవుని చేత సృజించబడినవాడు కాడు. దేవునికి పుట్టినవాడు కాదు. దేవునికి తరువాతివాదు కాదు. దేవుని కుమారుడంటే.. తల్లిలేనివాడు, తండ్రిలేనివాడు, వంశావళి లేనివాడు, జీవనానికి ఆది అయినా, జీవితానికి అంతమయినా లేనివాడు... (హెబ్రీ 7:3), ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టే ఆయన తనని తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు ‘ఇతడు తనని దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు’ అన్నారు. యేసుకు యెహోవా అనే పేరుందని పాత నిబంధనలోనూ, యెహోవాకు యేసు అని పేరుందని క్రొత్త నిబంధనలోనూ రాయబడింది. (నిర్గ 23:21; యోహా 17:11). ఆయన దేవునితో సమానుడు, దేవుని ప్రతిబింబం (హెబ్రీ 1:3 ఫుట్ నోట్),

 

బైబిల్లో యేసుక్రీస్తును యెహోవాగానూ, యేసుక్రీస్తును యెహోవాతో సమానునిగాను అనేకసార్లు రాయబడింది (ఫిలి 2:6), సిద్ధాంత

 

భావాలను ప్రక్కన పెట్టి ఒకసారి ఈ వచనాలను గమనించండి.

 

  1. యెహోవా ఉన్నవాడు (నిర్గమ 3:14) యేసుక్రీస్తు ఉన్నవాడు (హెబ్రీ 7:24)

 

2 . యెహోవా ప్రార్ధన ఆలకించువాడు (1రాజు 9:3; మత్త 6:6) యేసుక్రీస్తు ప్రార్ధన ఆలకించువాడు (మత్త 18:20),

 

3 . యెహోవా తీర్పరి (యెష 5:16; 1 పేతు 1:17) – యేసుక్రీస్తు తీర్పరి (మత్త 7:22,23; 25:32; యోహా 5:23).

 

  1. యెహోవా తండ్రి (యెష 63:16) – యేసుక్రీస్తు తండ్రి (యెష 9:6; యోహా 14:9,10)

 

  1. యెహోవా రక్షకుడు (యెష 43:11,12) – యేసుక్రీస్తు రక్షకుడు (మత్త 1:21; 1తిమో 2:3; తీతు 2:13),

 

  1. యెహోవా తేజోమయుడు (1తిమో 6:16)- యేసుక్రీస్తు తేజోమయుడు (1తిమో 3:16).

 

  1. యెహోవా ఆరాధనకు యోగ్యుడు (ప్రక 4:9) – యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు (ప్రక కొ8-12).

 

  1. యెహోవా మొదటివాడు కడపటివాడు (యెష 44:6) – యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు (ప్రక 22:13).

 

  1. యెహోవా నామం రక్షించునది (యోవే 2:32)- యేసుక్రీస్తు నామం రక్షించునది (అపొ.కా. 238; 4:12).

 

  1. యెహోవా భర్త (యెష 54:5) యేసుక్రీస్తు భర్త (ఎఫె 1:22:5:22-24; ప్రక 21:2,9),

 

  1. యెహోవా విమోచకుడు (1దిన 17:20,21: కీర్త 78:35; యెష 48:17) – యేసుక్రీస్తు విమోచకుడు (మత్త 20:28; గలతీ 1:4).

 

  1. యెహోవా మధ్యవర్తి (యెష 2:4; గలతీ 3:19,20) – యేసుక్రీస్తు మధ్యవర్తి (1తిమో 25).

 

13, యెహోవా ఆశ్రయుడు (యిర్మీయా 17:17)- యేసుక్రీస్తు ఆశ్రయుడు (యిర్మీయా 14:8,9; లూకా 2:7),

 

  1. యెహోవా విశ్రాంతినిచ్చువాడు (నిర్గ 33:14)- యేసుక్రీస్తు విశ్రాంతినిచ్చువాడు (మత్త 11:28).
  2. యెహోవా ప్రకటించినవాడు (యెష 43:11,12) యేసుక్రీస్తు ప్రకటించినవాడు (మత్త 4:17),

 

  1. యెహోవా రెక్కల క్రింద కాచువాడు (కీర్త 36:7) – యేసుక్రీస్తు రెక్కల క్రింద కాచువాడు (మత్త 23:37),

 

  1. యెహోవా నీటిపైన నడుచును (యోబు 9:8; హు 3:2,15)- యేసుక్రీస్తు నీటిపైన నడిచెను (మత్త  14:26)
  2. యెహోవా పొడవబడినవాడు (ఒక 12:8,10)- యేసుక్రీస్తు పొడవబడినవాడు (యోహాను 19:34; ప్రక 1:7),

 

  1. యెహోవా ఒలీవల కొండపై దిగువాడు (జెక 14:3-9)- యేసుక్రీస్తు ఒలీవల కొండపై దిగువాడు (అపొ.కా. 1:11,12),

 

  1. యెహోవా, క్రియల చొప్పున జీతమిచ్చువాడు (యెష 40:10) యేసుక్రీస్తు, క్రియల చొప్పున జీతమిచ్చువాడు (ప్రక 22:12,13,16,20).

 

  1. యెహోవా కాపరి (కీర్త 23:1) యేసుక్రీస్తు కాపరి (యోహాను 10:11).

 

  1. యెహోవా రాజ మార్గంలో వచ్చువాడు (యెష 40:3) యేసుక్రీస్తు రాజమార్గంలో వచ్చినవాడు (మత్త 3:3; యోహా 1:30),

 

  1. యెహోవా మేఘారూఢుడై వచ్చువాడు (ద్వితీ 33:26)- యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చువాడు (దాని 7:13; లూకా 21:27),                                                                                       24. యెహోవా జీవాత్మను ఊదినవాడు (ఆది 2:7) – యేసుక్రీస్తు జీవాత్మను ఊదినవాడు (యోహా 20:22),

 

  1. యెహోవా రాజు (కీర్త 10:16; యెష 33:22; 43:15) యేసుక్రీస్తు రాజు (జెకర్యా 9:9; మత్త 2:2; యోహా 1:49, 18:37),

 

  1. యెహోవా ఆకర్షించువాడు (యోహా 6:44,45) యేసుక్రీస్తు ఆకర్షించువాడు (యోహా 12:32),

 

  1. యెహోవా ఇశ్రాయేలీయులకు మధ్యకు వచ్చి నివసిస్తానన్నవాడు (నిర్గ 29:45; జెకర్యా 2:10-13; &3) -యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి నివసించినవాడు (పిలిప్పీ 2:6,7; మత్త 2:5,21),

 

  1. యెహోవా వెలుగు (కీర్త 27:1: 36:9, యెష 60:20)- యేసుక్రీస్తు వెలుగు (యోహా 8:12),

 

  1. యెహోవా ఆమెన్ అనువాడు (ఆది 1:3,6,9)- యేసుక్రీస్తు ఆమెన్ అనువాడు (ప్రక 3:14),

 

  1. యెహోవా ఏడు నేత్రములు గలవాడు (జెకర్యా 4:10)- యేసుక్రీస్తు ఏడు నేత్రములు గలవాడు (ప్రక 5:6).                                                                                 31. యెహోవా మహిమా స్వరూపి (ఎఫె 1:19)- యేసుక్రీస్తు మహిమా స్వరూపి (యాకో 2:1; 15రి 2:8).

 

  1. యెహోవా హృదయాలను పరిశీలించువాడు (1దిన 28:9) యేసుక్రీస్తు హృదయాలను పరిశీలించువాడు (ప్రక 2:23). 

 

  1. యెహోవా అసమానుడు (యెష 46:9, కీర్త 40:5) – యేసుక్రీస్తు యెహోవాకు సమానుడు (పిలిప్పీ 2:6),

 

  1. యెహోవా నామమున ప్రతీ మోకాలు వంగాలి (యెష 45:22-24)- యేసు నామంలో ప్రతీ మోకాలు వంగాలి (ఫిలిప్పీ 210,11),

 

  1. యెహోవా ఇశ్రాయేలీయుల రెండు కుటుంబాలకు అడ్డుబండ. (యెష 8:13-15)- యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకు అడ్డుబండ, అడ్డురాయి. అనేకులు పడుటకు లేచుటకు కారకుడు (లూకా 2:34; రోమా 9:32,33; 1 పేతు 2:5-7).

 

  1. యెహోవా యుగయుగములు జీవించువాడు (దాని 6:26) యేసుక్రీస్తు యుగయుగములు జీవించువాడు (ప్రక 1:18),

 

  1. యెహోవా మార్పులేని వాడు (మలాకీ 3:6)- యేసుక్రీస్తు మార్పులేనివాడు (హెబ్రీ 7:24; 13:8),

 

  1. యెహోవా సముద్రంపై తుఫాను రేగగా గాలిని గద్దించి తీరమునకు చేర్చును (కీర్త 107:28-30) యేసుక్రీస్తు సముద్రంపై తుఫాను రేగగా ఆయన గాలిని గద్దించి అణచివేసి ఆయనకు మొరపెట్టిన వారిని తీరమునకు చేర్చెను (మత్త 8:23-27),

 

  1. యెహోవా ప్రభావ స్వరూపము గలవాడు (యెహె 1:28)- యేసుక్రీస్తు ప్రభావ స్వరూపము గలవాడు (ప్రక 1:13-16).

 

40 . యెహోవా సింహాసనాసీనుడు (కీర్త 9:7; 47:8)- యేసుక్రీస్తు సింహాసనాసీనుడు (మత్త 19:28; 25:31).

 

  1. యెహోవా దేహములో నివసించువాడు (1కొరి 3:16) – యేసుక్రీస్తు దేహములో నివసించువాడు (రోనూ 8:10)

 

  1. యెహోవా సర్వాధికారి (ప్రక 1:8; 4:8; 21:22)- యేసుక్రీస్తు సర్వాధికారి (మత్త 28:18).                                                                                                              

 

  1. యెహోవా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (1తిమో 6:15) యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (ప్రభ 19:16),

 

  1. యెహోవా సృష్టికర్త (యెష 45:11,12: కీర్త 33:6; సామె 16:4) యేసుక్రీస్తు సృష్టికర్త (యోహా 1:3 ఎఫెసీ 2:10),

 

  1. యెహోవా ద్వారా, యెహోవా మూలముగా, యెహోవా నుండి సమస్తము కలిగాయి (రోమా 11:36)- యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా, యేసుక్రీస్తు నుండి సమస్తము కలిగాయి (యోహా 1:2; కొలస్స 1:16).

 

  1. యెహోవా గ్రుడ్డివాని కన్నులు తెరువజేయును (కీర్త 146:8) యేసుక్రీస్తు గ్రుడ్డివాని కన్నులు తెరువజేసెను (యోహా 9:6,7),

 

  1. యెహోవా బలవంతుడైన దేవుడు (యిర్మీ 50:34)- యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు (యెష 9:6),

 

  1. యెహోవా వేవేల పరిశుద్ధులతో వచ్చువాడు (జెక 14:5; యూదా 15; 1 థెస్స 4:14) యేసుక్రీస్తు వేవేల పరిశుద్దులతోవచ్చువాడు (1థెస్స 3:12; ప్రక 19:11-13).                                                                   49. ఆకాశములు యెహోవా చేతి పనులు (యెష 40:22)- ఆకాశములు యేసుక్రీస్తు చేతి పనులు (హెబ్రీ 1:10).

 

  1. యెహోవాయందే అతిశయించవలెను (యిర్మీ 9:24)- యేసుక్రీస్తునందే అతిశయించవలెను (25రి 10:17; గలతీ 6:14).

 

  1. యెహోవా దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు (కీర్త 90:4) యేసుక్రీస్తు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు (26 3:8).

 

  1. యెహోవాకు ముప్పది వెండి నాణెములు వెలకట్టబడెను (జెక 11:6-13)- యేసుక్రీస్తుకు ముప్పది వెండి నాణెములు వెలకట్టబడెను (మత్త 26:15),

 

  1. యెహోవా నామమున ప్రార్ధన చేయువాడు రక్షింపబడును (యోనే 2:32) యేసుక్రీస్తు నామమున ప్రార్ధన చేయువాడు రక్షింపబడును (రోమా 10:12,13),

 

  1. యెహోవా పాపములను పరిహరించువాడు (కీర్త 32:5) యేసుక్రీస్తు పాపములను పరిహరించువాడు (మత్త 1:21; 9:2),

 

  1. యెహోవా ఆశ్చర్యకరుడు (కీర్త 72:18) యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు (యెష :6),

 

  1. యెహోవా నిత్యుడు (యెష 40:28) – యేసుక్రీస్తు నిత్యుడు (యెష 9:6).

 

  1. యెహోవా మహాదేవుడు (ద్వితీ 10:17) యేసుక్రీస్తు మహాదేవుడు (తీతు 2:13),

 

  1. యెహోవా సూర్యుడు (కీర్త 84:11)- యేసుక్రీస్తు సూర్యుడు (మలాకీ 4:2).

 

  1. యెహోవా వెయ్యేండ్లు భూమిని పరిపాలించును (యెష 24:23; జెక 14:9)- యేసుక్రీస్తు వెయ్యేండ్లు భూమిని పరిపాలించును( 11:1-9; 5 20:4).



  1. యెహోవా సత్యస్వరూపి (ప్రక 6:10) యేసుక్రీస్తు సత్యస్వరూపి (ప్రక 3:7)

 

యేసుక్రీస్తును దేవుడు కాదని, దేవునితో సమానుడు కాదని అపవాది అనేక మంది క్రైస్తవులతో నమ్మించాడు. యేసుక్రీస్తు దేవుడు” కాడు అని నిరూపిస్తాం అంటూ ఛాలెంజ్లు చేస్తున్న క్రైస్తవ జ్ఞానులు కూడా బయలుదేరారు. క్రీస్తువిరోధి ఆత్మ యొక్క క్రియలు వాడితంత్రాలను తిప్పికొడదాం.

ఎవడైననూ ప్రభువుని ప్రేమించకుంటే వాడు శపించబడ్డును గాక.. (1కొరి 16:22). 








Scroll to Top