“పిల్లిని ఇంగ్లీష్ Cat అంటారు. అదే పిల్లికి ‘బిన్ని’ అని పేరు కనుక పెడితే ఇంగ్లీష్లో కూడా దానిని Binny అనే పిలుస్తాం. పంకాను ఇంగ్లీష్ Fan అంటారు. ఆ పంకా కనుక పోలార్ కంపెనీది అయితే ఇంగ్లీష్ లో కూడా Polar అనే అంటాం. జాతుల్ని, వస్తువుల్ని ఒక్కో భాషలో ఒక్కో విధంగా పిలుస్తాం కానీ వాటి పేర్లను మాత్రం ఏ భాషలో అయినా ఒకే విధంగా పలుకుతాం. ఒకని పేరు | తెలుగులో రాజేష్ అయితే ఇంగ్లీష్లో కూడా Rajesh అనే అంటాం. కానీ బైబిల్లో యేసుక్రీస్తు పేరును గమనిస్తే తెలుగులో యేసు, హిందీలో ఈసా, ఇంగ్లీష్ లో జీసస్, సంస్కృతంలో జేసు, గ్రీకులో ఈసోస్, హెబ్రీలో యెషువా. భాషకొక పేరుతో పిలవడానికి ఆయననేమైనా వస్తువా? దేవుని పేరు ‘యెషువా. అలా పిలిస్తేనే ఆయన పలుకుతాడు. మరేవిధంగా పిలిచినా ఆ ప్రార్ధనలు దేవుడు వినడు. ప్రతీ క్రైస్తవుడు యెషువా నామంలో మళ్ళీ బాప్తీస్మం పొందాలి”, ఇవి వీరి బోధలు,
మొట్టమొదటి భాష
ఆదాము నుండి నోవహు వరకూ, నోవహు నుండి బాబెలు గోపుర సంఘటన వరకూ ఒకే భాషను మనుషులంతా మాట్లాడేవారు. ఆ భాష ఏంటి? ఇంచుమించు ప్రతీ భాషవారు తమదే మొదటి భాష అనీ, తమ భాషే ఇతర భాషలకు మూలమని అంటారు. ముఖ్యంగా లాటిన్, సంస్కృతం, తమిళ భాషలు మాట్లాడువారు ఈ వాదన చేస్తుంటారు. మన భారతదేశ భాషల్లో కొన్ని చాలా పురాతనమైనవి కావచ్చు. కానీ మొదటి భాష మన దేశ భాషల్లో లేదు. బైబిల్ మరియు చారిత్రక ఆధారాలను బట్టి మనుషులు మాట్లాడిన మొట్టమొదటి భాష… | ఆదిమ హెబ్రీ భాష (Ancient Hebrew), హెబ్రీ భాష మొదట బొమ్మల లిపి కలిగి ఉండేది. ఆదిమ హీబ్రూనే కొన్ని ప్రాంతాలలో అరామిక్ అని పిలిచారు. హెబ్రీ మరియు అరామిక్లు ఒకే అక్షరాలను (Alphabets) కలిగి ఉంటాయి. వాటిని వాడటంలో చిన్న తేడా ఉంటుంది. హెబ్రీ మరియు అరామిక్లను ఒకే భాషగా చాలా మంది పరిగణిస్తారు. అబ్రహాము సమాధిపై కూడా హెబ్రీ అక్షరాలే రాయబడ్డాయి. ఆదాము (ఆదామ్), హవ్వ (హవ్వ), షేతు (షెత్), నోవహు (నొవహ్) ఈ పేర్లన్నీ హెబ్రీ భాషాపదాలు. మొదటి భాష హెబ్రీ కాబట్టే వీరి పేర్లు హెబ్రీలో పెట్టబడ్డాయి.
హెబ్రీ భాష అక్షరాలు అలెఫ్, బెత్, గిమెల్ అని మొదలవుతాయి. గ్రీకు అక్షరాలు ఆల్ఫా, బీటా, గామా అని మొదలవుతాయి. ఇంగ్లీష్ కూడా మొదటి అక్షరాలు A, B.. తెలుగులో మొదటి అక్షరం కూడా ‘అ’ అరబిక్, తమిళం, సంస్కృత భాషలలో మొదటి అక్షరం కూడా ‘అ’. ఇలా ప్రస్తుతమున్న భాషలలో 80% భాషలకి హెబ్రీ భాషే మూలమని పరిశోధనలు చెబుతున్నాయి. వీటన్నింటి ఆధారాలను బట్టి ఆదిమ హెబ్రీనే మొదటి భాషగా నిర్ధారించవచ్చు. మిగతా భాషలు, ఆ భాషలు మాట్లాడువారు రాసిన గ్రంథాలు, సృష్టి మరియు దేవుని గూర్చి వారికున్న నమ్మకాలు ఇవన్నీ బాబెలు గోపుర సంఘటన తర్వాతవే. బైబిలే సత్యం.
భాషల మధ్య వ్యత్యాసం
ప్రతీ భాషను వేరు వేరుగా ఉండేలా, కొన్ని భాషల్లో ఉండే పదాలు, అక్షరాలు ఇంకొన్ని భాషల్లో ఉండకుండా ఉండేలా, కొన్ని పదాలకి వేరు వేరు భాషల్లో వేరు వేరు అర్ధాలు వచ్చేలా దేవుడు భాషని తారుమారు చేసాడు. భాషలు ఎలా వేరు వేరుగా పలుకబడుతాయో వాటి లిపి కూడా అలా వేరు వేరుగానే ఉంటుంది. బొమ్మల రూపంలో కొన్ని లిపులు (Hieroglyphics), అక్షరాల రూపంలో కొన్ని, అంకెల రూపంలో కొన్ని, పదాల రూపంలో కొన్ని తయారు చేయబడ్డాయి.
మనకు అవసరమైన కొన్ని భాషల గూర్చి…
అరమయిక్ భాష: బైబిల్లో కొన్ని భాగాలు రాయబడిన ఈ భాషకు 22 అక్షరాలుంటాయి. దీనిని కుడి నుండి ఎడమకు రాస్తారు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉండగా అరామిక్ కూడా మాట్లాడాడు.
హెబ్రీ భాష: దీనికి 22 అక్షరాలు (Alphabets) ఉంటాయి. ఈ భాషను కుడి నుండి ఎడమకు రాస్తారు. ఈ భాషలో ఉన్న ప్రతీ అక్షరం ఒక్కో బొమ్మని ఆధారం చేసుకుని ఉంటుంది. ఒక్కో అక్షరం ఒక్కో అంకెను సూచిస్తుంది. వీరికి అక్షరాలే అంకెలు. ఆ అక్షరాలకు ఉన్న బొమ్మలలో అనేక మర్మాలు దాగి ఉంటాయి. లాటిన్ భాష: దీనికి 23 అక్షరాలు ఉంటాయి. చూడటానికి ఇంగ్లీష్ గా కనిపించే లాటిన్ ఎడమ నుండి కుడికి రాస్తారు. రోమా ప్రభుత్వం ఈ భాషనే మాట్లాడేవారు. ఇంగ్లీష్ భాషకు జర్మన్ మరియు లాటిన్ భాషలే మూలం. |గ్రీకు భాష: దీనికి 24 అక్షరాలు ఉంటాయి. క్రొత్త నిబంధన రాయబడిన ఈ భాషను ఎడము నుండి కుడికి రాస్తారు. ఈ భాషకు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు ఉంటాయి.
కాలం గడిచేకొద్దీ సమాచారాన్ని ఒక భాష నుండి మరో భాషలోనికి మార్చాల్సివచ్చింది. దీనినే తర్జుమా అంటారు (Translation). తర్జుమా చేసేటపుడు ఒక సమస్యను తర్జుమాదారులు ఎదుర్కొన్నారు. ఒక భాషలో పేరు ఇంకో భాషలో రాసేటపుడు ఆ భాష యొక్క లిపిలో ఉన్న శబ్దాలు ఇంకో భాషలో లేకపోవడం వలన పేరును ఉన్నది ఉన్నట్లుగా రాయడం సాధ్యపడదు. ఉదాహరణకు శాంతి అనే ఒక పేరును రాయాలంటే ఇంగ్లీష్ లో Sa (స) మరియు Sha (ప) అనే శబ్దాలను ఇచ్చే అక్షరాలున్నాయి కానీ ‘శ’ అనే శబ్దాన్ని ఇచ్చే అక్షరం లేదు. Finny అనే ఒక పేరును తెలుగులో రాయలి. తెలుగులో ప (pa) ఉంది. ఫ (ppa) ఉంది కానీ Fa అనే శబ్దం ఇచ్చే అక్షరం లేదు (మనలో చాలామంది ‘ఫ’ ను ‘Fa’ గా పలుకుతారు. అది తప్పు, తెలుగులో Fa లేదు). F తో ప్రారంభమయ్యే ఏ పేరు రాయాలన్నా ఇదే. సమస్య వస్తుంది. A తో ప్రారంభమయ్యే 90% పేర్లను కూడా తెలుగులో రాయలేము. ఇలా ప్రతీ భాషలోనూ ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి కారణం మనిషి కాదు. దేవుడే భాషల్ని ఇలా సృష్టించాడు. ఈ సమస్యని పరిష్కరించడానికి ఒక భాషలో ఏ శబ్ధమైతే లేదో ఆ శబ్దానికి దగ్గరగా ఉన్న మరో పదాన్ని రాస్తారు. దీనినే ‘లిప్యంతరీకరణ’ (Transliteration) అంటారు. అంటే ‘శాంతి’ బదులు Shanthi (షాంతి), Andrews కి బదులు యాండ్రూస్, Apple కి బదులు ఆపిల్ ఇలా రాస్తారు. భాష భాషకు పేర్లు కొంచెంగా మార్చబడతాయి కానీ తర్జుమా చేయబడవు.
పర్షియన్ వారికి ‘స’ అనే శబ్దం ఇచ్చే అక్షరం లేదు. అందుకే వారు స బదులు ‘హ’ రాస్తారు’ అందుకే వారు సింధుని హిందు అని పిలిచారు.
పాత నిబంధన తర్జుమా…
పాతనిబంధన గ్రంథంలో అతి ఎక్కువ భాగము హెబ్రీ భాషలో రాయబడింది. అక్కడక్కడా అరామిక్లో రాయబడింది (ఎజ్రా 4 నుండి 7 అధ్యాయాలు, దానియేలు 2 నుండి 7 అధ్యాయాలు). క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన గ్రంథాన్ని క్రీ.పూ.3వ శతాబ్దంలో గ్రీకు భాషలోనికి యూదులు తర్జుమా చేసారు. దీనినే సెప్టుజెంట్ అంటారు. దీనిలో, హెబ్రీ భాషలో ఉన్న కొన్ని శబ్దాలు గ్రీకు భాషలో లేకపోవడంతో మనుష్యుల, ప్రాంతాల పేర్లను లిప్యంతరీకరణ (Transliteration) చేసారు. అందులో అబ్రాహామును అవ్రామ్. మోపేను మోయిసిస్, యెషువా పేరును ఈసోస్ గా మార్చారు. ఈ లిప్యంతరీకరణ స్వయంగా యూదా మత బోధకులే చేసారు. దేవుడే భాషలను ఇలా చేసాడు కాబట్టి ఇలా పేర్లు లిప్యంతరీకరణ చేయబడుట అనేది దేవునికి లోబడటమే కానీ వ్యతిరేకించడం కాదు.
క్రొత్త నిబంధన తర్జుమా….
క్రొత్త నిబంధన కాలానికి గ్రీకు ప్రపంచ భాషగా ఉంది. అన్యులతో పాటు యూదులు కూడా గ్రీకును విరివిగా మాట్లాడేవారు. అందుకే క్రొత్త నిబంధనని గ్రీకులో రాసారు.
గ్రీకు భాష నియమాలు:
యేసు అను పేరు..
యేసుక్రీస్తుకి యెహోషువా పేరునే పెట్టడం జరిగింది. యెహోషున పేరును సాధారణంగా పలికేటపుడు (Shortcut) యెషువా అని పలుకుతారు. ఆ పేరునే యేసుకు పెట్టారు. ఆ కాలంలో ఈ యెషువా అనే పేరు చాలామంది పెట్టుకునేవారు (అపొ.కా 13:6; కొల 4:11). ఇది హెబ్రీ భాషా పదం. క్రీస్తు శిష్యులంతా గ్రీకులో ఏదైనా పత్రిక రాయాలంటే ‘యెషువ’ అనే పేరును గ్రీకువారు ఏమని రాస్తారు?
యెషువ అనే పదంలో మొదటి అక్షరమైన ‘యె’ హెబ్రీ భాషలో 10వ అక్షరమైన Yod తో వ్రాస్తారు. కానీ గ్రీకు అక్షరమాల (Alpha-bets) లో ‘య’ అనే శబ్దం లేదు. కాబట్టి ‘యె’కి బదులు ఇయోట (E), ఈటా (C) లను కలిపి ‘ఈ’ (IE) అని రాస్తారు. దీనిని ‘ఈ’ కు ”ఏ’ కు మధ్యలో పలుకుతారు. ‘షు’ అనే రెండవ అక్షరాన్ని హెబ్రీలో 21వ అక్షరమైన (Shin) తో రాస్తారు. కానీ గ్రీకులో ‘ష’ అనే శబ్దమిచ్చే అక్షరం కూడా లేదు. దానికి బదులు సిగ్మా (0), ఒమిక్రాన్ (O), ఉప్సిలాన్ (1)) లను కలిపి ‘సో’ (SOU) అని రాస్తారు. ‘వ’ అనేది హెబ్రీలో సైలెంట్ లెటర్ అయిన ‘Ayin’తో రాస్తారు. కాబట్టి గ్రీకు వారు దాన్ని రాయరు. పురుష నామవాచక పదం వచ్చినప్పుడు గ్రీకులో à (జీటా)ని చేరుస్తారు కాబట్టి దానికి చివరన ‘S’ చేర్చారు. యెషువ అనే హెబ్రీ పదం, గ్రీకు భాష లిపిలోనికి వచ్చేసరికి (IESOUS ఈసోస్) అయ్యింది. ఇది తర్జుమా కాదు. లిప్యంతరీకరణ. ‘యేసు’ పేరు translate చేయబడలేదు. transliterate చేయబడింది. అందుకే సిలువ పై మూడు భాషలలో పైవిలాసము రాసినపుడు ఒక్కో భాషలో యేసు పేరును ఒక్కో విధంగా రాసారు. లాటిన్ లో ఆయన పేరును IESUS అని రాసారు (INRI లో) ఈసోస్ లాటిన్లో ఈసస్ గా, ఇంగ్లీష్ జీసస్ గా మారింది. మన తెలుగులో అన్ని భాషలకన్నా అత్యంత దగ్గరగా యేసు పేరు లిప్యంతరీకరణ చేయబడింది. గ్రీకులో ఉన్న ఈసోస్లో ‘స్’ అనేది గ్రామర్ కి సంబంధించినది కాబట్టి విడిచిపెట్టారు. ‘ఈ’ ను ఇంచుమించు ‘యే’ గా పలుకుతారు కాబట్టి ‘యే’ గానే లిప్యంతరీకరణ చేసారు. అలా ఈసోస్, యేసుగా మన భాష మరియు ‘లిపి’ ని బట్టి వ్రాయబడుతుంది. ఇది పాపము కాదు, వాక్య విరుద్ధమూ కాదు. ఎందుకంటే భాష భాషకు పేర్లలో మార్పు వస్తుందని బైబిలే చెప్తుంది… పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీభాషలో వానికి అబద్దానని పేరు, గ్రీసు దేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను (ప్రకటన 9:11) మరియు యెప్పేలో తబితా అను శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు (అపా.కా 9:36), హెబ్రీ భాషలో పాల్లెలూయాను ప్రకటన 19:1 లో అల్లెలూయా అని రాయబడింది. గ్రీకులో ‘హ’ అనే అక్షరం లేదు కాబట్టి ‘హ’ బదులు ‘అ’ వాడారు. నూతన నిబంధన రచనలన్నీ గ్రీకులోనే వ్రాయబడ్డాయి. వారంతా తమ సువార్తల్లో, లేఖల్లో యేసు పేరును ఈసోస్ అనే రాసారు. యెషువా అని ఒక్కసారి కూడా రాయబడలేదు. ఇప్పటివరకూ లభ్యమైన మొదటి శతాబ్దపు మూలప్రతుల ఫోటోలు, ఆధారాలు గమనించండి.