జుడాయిజం
జుడాయిజం యూదులకి మత నిష్ఠ ఎక్కువ. వారు తమ మాతాచారాలను సరిగా పాటించినా పాటించకపోయినా, తమ మతాన్ని పరిరక్షించుకోవడంలో మాత్రం చాలా రోషంగా ఉంటారు. అందుకే 1500
దేవుడు ఎన్నో సంవత్సరాలు వేచి చూసి ఆయన నిశ్చయించుకున్న రోమా ప్రభుత్వ కాలంలో ఈలోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు. దానినే దేవుని రాజ్యం అని పరలోకరాజ్యం అని సంఘము అని దేవుడు పిలిచాడు.
ఆ సంఘస్థాపన కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో ప్రయాణాలు చేసాడు. ఎన్నో అద్భుతాలు చేసాడు. చివరికి ఆయన ప్రాణం కూడా ఇచ్చేసాడు. మరణాన్ని జయించి పాతాళ లోక ద్వారాలు సంఘం ముందు నిలవకుండా చేసాడు. ఆయన అవతారం చాలించి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. ఇక తన సంఘ అభివృద్ధి కోసం, రాజ్యవ్యాప్తి కోసం ఆత్మరూపిగా పనిచెయ్యగలడు కానీ ప్రత్యక్షంగా పనిచెయ్యడానికి లేదు. మరో ప్రక్క ఆయన శత్రువైన సాతాను సంఘాన్ని విస్తరించకుండా చెయ్యడానికి, సంఘాన్ని పాడుచెయ్యడానికి కాచుకుని ఉన్నాడు. ప్రభువు తన సంఘ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి? ఎలాంటి అర్హతగలవారికి తన రక్తంతో కొనుక్కున్న మందని అప్పగించాలి..?
శిష్యులతో కలిసి ఒలీవకొండకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందు నుండి ఉన్నవాడు, దేనికైనా ముందుండేవాడైన పేతురుతో… నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించాడు. అవును అని సమాధానమిచ్చాడు. వెంటనే ఆయన నా గొర్రెపిల్లల్ని మేపు అన్నాడు. మళ్ళీ పేతురుతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు.. అవును ప్రభువా అని సమాధానం ఇచ్చాడు. ఆయన నా గొర్రెలను కాయి అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాకా మళ్ళీ పేతురూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు తనలో తాను చాలా బాధపడి (వ్యసనపడి కాదు. Grieved – చాలా దుఃఖము, బాధ) నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నాడు. ఆయన నా గొర్రెల్ని మేపు అన్నాడు (యోహా 21:15-18).
ప్రభువు తన ఆస్తిని, తన ఆశని ఎవరికైనా అప్పగించాలి అనుకుంటే ఆయన చూసే అర్హత తనని ప్రేమిస్తున్నాడా? లేదా? అని. ఎందుకంటే ప్రభుని ప్రేమించనివాడు ఆయన సంఘాన్ని కూడా ప్రేమించలేదు. ప్రభుని ప్రేమించనివాడు ఆయన సంఘ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేడు. ఆయనను ప్రేమిస్తే, ఆయన ప్రాణం పెట్టి కొనుకున్న సంఘాన్ని కూడా ప్రేమించగలం.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు చెప్పిన ప్రతీసారీ సంఘం విషయంలో ఒక బాధ్యతని అప్పగించాడు. మొదట గొర్రెపిల్లల్ని మేపమన్నాడు. అనగా అప్పుడే సువార్త విని వచ్చినవారికివ్వాల్సిన ఆహారం ఇవ్వమన్నాడు. తరువాత నా గొర్రెల్ని కాయి (Take care of my sheep) అన్నాడు. అనగా గొర్రెలకి బయటనుండి ప్రమాదముంది, జాగ్రత్త చూసుకో అని చెప్పాడు. తరువాత గొర్రెల్ని మేపు అన్నాడు.
అనగా దేవునిలో స్థిరపడిన సంఘానికి ఇవ్వాల్సిన బలమైన ఆహారం ఇవ్వమన్నాడు. ఈ మూడు బాధ్యతల్ని నిర్వర్తించేవాడే నిజమైన దేవుని జతపనివాడు..
అందుకే దేవుడు సేవకుల్ని వ్యవసాయకులు అన్నాడు. రైతు కేవలం విత్తనాలు నాటడం, నీరు కట్టడం మాత్రమే చెయ్యడు. పశువులు పొలంలో పడకుండా కంచె వేస్తాడు. చీడ పురుగు పడితే ఔషధాలు వాడతాడు (1 కొరి 3:9), అందుకే దేవుడు సేవకుల్ని సైనికులు అన్నాడు. శత్రువు తన రాజ్యంలోనికి రాకుండా సైనికుడు ప్రాణాలొడ్డి
(23 2:3-6).
కానీ కాలం గడిచేకొద్దీ సేవకులకు ప్రభుపై ప్రేమ తగ్గింది. దేవుడు పిలిచాడనో, తండ్రి ప్రారంభించిన సేవ కొనసాగించాలనో, మామయ్యగారు కట్నంగా ఇచ్చిన చర్చిని నడిపించాలనో, కోతవిస్తారంగా ఉంది పనివారు లేరు అనో సేవకివచ్చినవారు కనిపిస్తున్నారు కానీ ఎలా సేవకి వచ్చినా ప్రభుపై ప్రేమతో సేవ చేసేవారు కనిపించడం లేదు. అందుకే… గొర్రెపిల్లల్ని మాత్రమే మేపే బోధలు అనగా విశ్వాసం, ఆశీర్వాదాల కోసం మాత్రమే బోధించే సేవకులు కనిపిస్తున్నారు. లేదా ఆజ్ఞల్ని బలవంతంగా రుద్దుతూ, రక్షణని కఠినతరం చేస్తున్న సేవకులు కనిపిస్తున్నారు. కానీ మందను కాపాడేవారు కనిపించడం లేదు.
పౌలయితే నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్ళు సంఘములోనికి వచ్చి మందను ఈడ్చుకుపోతారు కాబట్టి జాగ్రత్త అంటూ 3 సంవత్సరాలు ఏడుస్తూ హెచ్చరించాడు (అపో 20:29-31;తీతు 2:15; రోమా 16:17). తాను ఉన్నప్పటికే ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. కానీ అపొస్తలులు ఏదైనా దుర్బోధ రాగానే వెంటనే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకుని, సంఘాలకు కరపత్రికలు రాసి అప్రమత్తం చేసేవారు. దుర్బోధకులను ఎదుర్కొని సత్యం పక్షంగా వాదించేవారు. అందుకే తానుండగా ఆ తోడేళ్ళు సంఘంలోనికి రాలేకపోయాయి (అపొ.కా 15 అధ్యా; గలతీ పత్రిక).
నేడు ఎంతో మంది సేవకులు ఇక్కడ ఆగిపోయారు. ఈ హెచ్చరికను మర్చిపోయారు. అపవాది మనం ఆగిపోయిన చోట ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎన్నో రకాల దుర్భోధకుల్ని, అబద్ధశాఖల్ని, దొంగప్రవక్తల్ని, అబద్ధక్రీస్తులను సంఘములోనికి పంపించాడు. గొర్రెపిల్లల్ని, గొర్రెల్ని ఈడ్చుకునిపోయాడు. ఎందరో కాపరులను మోసగించి తీసుకుపోయాడు.
చాలా మంది సేవకులు ఆస్తులపై, పేరుప్రఖ్యాతలపై దృష్టికలిగి సంఘబాధ్యతల్ని విస్మరించారు. ఎంతో మంది సేవకులకు సంఘాన్ని కాపలా కాయాలి అనే బాధ్యత ఒకటి తమ మీద ఉంది అని కూడా వారికి తెలీదు. ఇంకొంతమందికి దుర్బోధలు ఉన్నాయి అని తెలిసినా వాటిని పరిశీలించడంలేదు, వాటి గూర్చి తమ సంఘాలను హెచ్చరించడంలేదు… తత్ఫలితంగా…
ఎక్కడ చూసినా దుర్బోధలు.. దుర్బోధ సంఘాలు.. మోసపోతున్న విశ్వాసులు.. మోసపూరితంగా బోధిస్తున్న సేవకులు.. సత్యం శిధిలమైంది.. వాక్యం వక్రీకరించబడింది.. అపవాది గర్వంతో విర్రవీగుతున్నాడు.
ఒక వ్యక్తి మారుమనసు పొందితే పరలోకమంతా సంతోషం. అంటే దేవుడు సంతోషిస్తూ, తనతోపాటు పరలోకంలో ఉన్నవారిని సంతోషించమని చెప్తున్నాడు (లూకా 15:6,7). మరి మారుమనసు పొందిన ఒక వ్యక్తి ఈ దుర్బోధలలో కలిసిపోతే..? పరలోకమంతా దుఖం కాదా.. దేవుడు ఎంతో బాధపడడా..?
దేవునిని ప్రేమించేవారికే ఆ బాధ అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు మనమేంచెయ్యాలి? ఎక్కడ ఆగిపోయామో అక్కడ నుండి మొదలు పెట్టాలి. అపవాది తంత్రాలు తెలుసుకోవాలి.. వాడి బోధల్ని, బోధకుల్ని ఖండించాలి. విశ్వాసులకి దుర్బోధల గురించి అవగాహన కలిగించాలి. అందుకే ఈ యుద్ధం..
ప్రభుని ప్రేమించినవారే ఈ యుద్ధాన్ని చేయగలరు.
అపవాదిచేత నడిపించబడుతున్న ఈ దుర్బోధశాఖల వారు రాత్రిపగలు శ్రమపడుతున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నారు. వారు గర్జించే సింహాలు.. వారివి బలమైన కోటలు, వారి సంఖ్య లెక్కకు కోట్లు..
కాని సత్యం పక్షంగా నీవు ఎత్తే గొంతు.. సింహాల గర్జన కంటే గొప్పది.. కోటలకు బీటలు వారించేటంత బలమైంది. మనలో ప్రతీ ఒక్కరూ వేయిమంది కంటే ఎక్కువవుతాం.. దావీదు వలే సింహాలను వెంటాడి, వాటి నోళ్ళలో చిక్కుకున్న విశ్వాసుల్ని కాపాడదాం. వాక్యఖడ్గంతో సింహాలను నేలకు కొట్టి చితకద్రొక్కుదాం.. ఇంతకాలం మన వ్యక్తిగత సమస్యలపై ప్రభు మన పక్షంగా యుద్ధం చేసాడు.. ఇప్పుడు ఆయన సంఘం కోసం ఆయన పక్షంగా మనం యుద్ధం చేద్దాం..
మనం ప్రశ్నించనంతకాలం వీళ్ళు విచ్చలవిడిగా మన వీధుల్లో తిరుగుతారు. ఒక్కసారి వారిని ఆపి నిలదీసి ప్రశ్నించి చూడు. మరలా నీ ప్రాంతంలో అడుగుపెట్టరు.
ఎవరో పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు వస్తారు, మీ ప్రాంత సంఘాలను వీరి బోధ నుండి కాపాడతారు అని ఇంకెంతకాలం ఎదురు చూపులు? నీ సంఘం నుండి కొంతమందిని దొంగిలించారని ఇంకెంతకాలం నిరుత్సాహం? కదులు.. మీ ఊరు.. మీ పట్టణం.. మీ మండలం బాధ్యత నీ మీద వేసుకో.. నువ్వే పోరాడు..
ఈ యుద్ధం చదవండి.. ఇక నుండి యుద్ధం చేయండి..
జుడాయిజం యూదులకి మత నిష్ఠ ఎక్కువ. వారు తమ మాతాచారాలను సరిగా పాటించినా పాటించకపోయినా, తమ మతాన్ని పరిరక్షించుకోవడంలో మాత్రం చాలా రోషంగా ఉంటారు. అందుకే 1500
యెషువా మెస్సీయా “పిల్లిని ఇంగ్లీష్ Cat అంటారు. అదే పిల్లికి ‘బిన్ని’ అని పేరు కనుక పెడితే ఇంగ్లీష్లో కూడా దానిని Binny అనే పిలుస్తాం. పంకాను
క్రీస్తువిరోధి ఆత్మ అపవాది అనేక రకాలుగా ఈ లోకంలో పనిచేస్తాడు. అపవిత్రాత్మ, మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, దాస్యపు ఆత్మ ఇలా రకరకాల పేర్లతో వాడి క్రియలను
మోర్మనిజం బైబిల్ కు ఏమాత్రం సరిపడని ఈ బోధ అమెరికాలో ప్రారంభమై ప్రస్తుతం 2 కోట్ల మంది సభ్యులు, 90 వేల మంది మిషనరీలతో అత్యంత వేగంగా
షించియోంజి (క్రొత్తభూమి క్రొత్త ఆకాశం) పార్క్ అనే వ్యక్తి 1956 లో జీసస్ క్రైస్ట్ రివైవల్ కాంగ్రగేషన్ను కొరియాలో స్థాపించాడు. అత్యంత వేగంగా విస్తరిస్తుండగా ఇతడు తనను
యెహోవా సాక్షులు వీరి కరపత్రికల పరిచర్య పేరు “కావలి కోట” (Watch tower). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో ముద్రించబడుతున్న నెలవారి మ్యాగజైన్స్లో ఈ Watch tower