యూదులకి మత నిష్ఠ ఎక్కువ. వారు తమ మాతాచారాలను సరిగా పాటించినా పాటించకపోయినా, తమ మతాన్ని పరిరక్షించుకోవడంలో మాత్రం చాలా రోషంగా ఉంటారు. అందుకే 1500 సం||ల పాటు అంటే మోషే కాలం నుండి క్రీస్తు వచ్చేవరకూ ఇతర దేశాలకు బానిసలుగా అమ్ముబడినా, వీరే రాజ్యాలు చేసినా ఇతర మతాల్లో కలిసిపోకుండా యూదా మతాన్ని నిలబెట్టుకున్నారు.
కానీ క్రీస్తు వచ్చాక అనేకమంది యూదులు ధర్మశాస్త్రానికి వేరుగా బోధించబడుతున్న నూతన మార్గంలోకి ప్రవేశించడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాకా వేలమంది యూదా మతాన్ని విడిచి క్రైస్తవులుగా మారడంతో క్రైస్తవ్యాన్ని తమ మతానికి శత్రువుగా భావించారు. యూదులకి క్రైస్తవులపై అప్పుడు ప్రారంభమైన అసహ్యం, కోపం నేటికీ కొనసాగుతుంది.
అపోస్తలుల్ని చంపించడం, క్రైస్తవుల్ని ఆరాధించకుండా సమాజమందిరాల్లో నుండి ఈడ్చి పాడెయ్యడం, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబును రాళ్ళతో కొట్టించి చంపడం ఇలా క్రైస్తవ్యాన్ని ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నించేవారు.
క్రీస్తు చనిపోయిన సుమారు 40 సం॥లకు అంటే క్రీ.శ. 70లో రోమా చక్రవర్తికి యూదులకి పదే పదే భేదాభిప్రాయాలు రావడంతో యూదులపై యుద్ధం ప్రకటించింది. అది పస్కా పండుగకు 2 రోజుల ముందు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా యెరూషలేములోనే ఉన్నారు. రోమా సైనికులు యెరూషలేమును ముట్టడి చేసి ఆ పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసారు. ఈ క్రమంలో సుమారు 11 లక్షల మంది యూదులు చనిపోయారని నాటి చరిత్రకారుడు రిపైజోసెఫస్ రాసాడు. ఎందరో యూదా బాలురు బానిసలుగా అమ్మబడ్డారు. వారు కోరుకొన్నట్లే క్రీస్తు రక్తాపరాధం వాకి వారి పిల్లల పైకి వచ్చింది. చాలా మంది తప్పించుకుని పారిపోయి ఎక్కడెక్కడికో చెదరిపోయారు. అందులో ఎక్కువ శాతం మంది మన భారతదేశం వచ్చారు. ఎందుకంటే సొలొమోను పరిపాలనా కాలంలో వర్తకం నిమిత్తం చాలామంది యూదులు కేరళ ప్రాంతానికొచ్చి స్థిరపడ్డారు. వీరి సహాయంతో వారు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. దేవాలయం కూల్చబడేటప్పుడు ఎవ్వరూ అడ్డుపడవద్దు అని యేసుక్రీస్తు ప్రవచించినా హెచ్చరించినా లెక్కచెయ్యకపోవడంతో యూదులు ప్రపంచమంతా దిక్కులేనివారిగా చెదరిపోవలసివచ్చింది.
అంతటితో యూదా మతం నుండి క్రైస్తవ్యానికి వస్తున్న వ్యతిరేకతలు ఆగిపోయాయి. కానీ యూదులలో క్రీస్తుపై, క్రైస్తవ్యంపై ఉన్న పగ అలాగే ఉండిపోయింది. తరాలు మారిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యి, హిట్లర్ చేత ఘోరంగా త్రొక్కబడి యూదులు మళ్ళీ 1948లో ఇశ్రాయేల్ దేశంగా అవతరించారు. మళ్ళీ తమకంటూ ఒక దేశం ఏర్పడింది.
ఈ 1900 సంవత్సరాలలో వీరు ఏ ఏ దేశాల్లో చెదిరిపోయారో, వారితో వివాహ సంబంధాలు కలుపుకోవలసి వచ్చింది. చాలామంది తమ వంశావళి, గోత్రాలు కూడా మరచి పోయారు. అనేకమంది గోత్రాలు సంక. వారికి రాజ్యం ఏర్పడటంతో ఇశ్రాయేల్కి ప్రపంచం నలుమూలల నుండి యూదులు తిరిగి వచ్చారు. అందులో అందరూ యూదులా, కాదా, వారు ఏ గోత్రాలవారు అనే విచారణ ప్రారంభమైంది. చాలా మంది యూదులు తాము యూదులమని నిరూపించుకోలేకపోవడంతో ఇశ్రాయేల్ పౌరసత్వాన్ని పొందలేకపోయారు.
లక్షలమంది యూదులు ఇతర దేశాలలో స్థిరపడిపోవడంతో వారు ఇశ్రాయేలికి తిరిగి వెళ్ళలేదు. ఆంధ్రా, తెలంగాణాల్లో కూడా చాలా చోట్ల యూదులున్నారు. కానీ తరాలు గడిచిపోవడం, మన ప్రాంతపు వారితో వియ్యమందడంతో వారు కూడా మనలాగే కనిపిస్తారు. –
యూదులు ఒక రాజ్యంగా స్థిరపడిన తరువాత వారిలోని మత పెద్దలలో కొందరు మళ్ళీ క్రైస్తవ్యాన్ని పాడుచెయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది యూదులను మళ్ళీ సంఘటితపరిచారు. ధనానికి లోబడిపోయే కొందరు పాస్టర్లను తమవైపు త్రిప్పుకుని వారి ద్వారా జుడాయిజాన్ని క్రైస్తవ్యంలోనికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు (చివరి పేజీలో చూడండి). విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ, రహస్యంగా కూటములు పెడుతూ కొంతమంది సేవకులకి సున్నతి చేసి యూదులుగా మార్చారు. వారి ద్వారా వేలమంది క్రైస్తవుల్ని మోసగించారు. హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, పాలకొల్లు ఇలా అనేక ప్రాంతాల్లో సమాజమందిరాలు స్థాపించారు. బలులు మినహాయించి మిగతావన్నీ ఆర్భాటంగా నిర్వహిస్తూ అనేకుల్ని ఆకర్షిస్తున్నారు. కొద్దికాలం క్రితం ఇశ్రాయేల్ నుండి కొందరు రబ్బీలు వచ్చి భారతదేశంలో పలు చోట్ల కాన్ఫెరెన్స్లు కూడా నిర్వహించారు.
ఇతర మతస్తులను తమ మతంలో కలుపుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని యూదులు క్రైస్తవ్యం మీద ఉన్న కక్షతో సంఘాన్ని అభ్యంతరాలకు గురిచేస్తూ అనేక వివాదాలు సృష్టిస్తూ, తమ బోధలను అంగీకరించిన క్రైస్తవులకు సున్నతి చేసి యూదులుగా మారుస్తున్నారు.
వీరికి రెండే రెండు లక్ష్యాలు ఉంటాయి. మొదటిది యేసుక్రీస్తును సాధారణ మనిషిగా నిరూపించడం. రెండవది క్రొత్త నిబంధన గ్రంథం మానవ కల్పితంగా నిరూపించడం. వీరి ప్రసంగాలు, పుస్తకాలు అన్నీ ఈ లక్ష్యాలను ఆధారం చేసుకుని మాత్రమే ఉంటాయి. వీరు క్రీస్తును అవమానిస్తూ, బైబిల్ను వక్రీకరిస్తూ అనేక పుస్తకాలు రాసి ఉచితంగా క్రైస్తవులకు పంచుతున్నారు.
యేసుక్రీస్తును గూర్చి వీరి బోధలు
ఒక స్త్రీ గర్భవతి అయ్యి కుమారుని కనడం ఏమైనా వింతా…? ఒక సాధారణ విషయానికి ‘ప్రభువే ఒక సూచన చూపును’ అని రాయాలా…? పైగా Al-maw అనే హీబ్రూ పదానికి damsel, maid, virgin అని అర్ధాలు. ఈ మూడు పదాలు కూడా కన్యక అనే అర్ధాన్నే ఇస్తాయి.
క్రొత్త నిబంధన కేవలం కల్పితమని వీరి బోధిస్తారు.
క్రొత్త నిబంధనలో అనేక తప్పులున్నాయని, పరస్పర విరోధాంశాలున్నాయని (Contradictions), బైబిల్ కనుక దేవుని వాక్యమయితే ఇలా ఎందుకుంటుందని వీరు వాదిస్తారు. క్రొత్త నిబంధన అంతా ఒక భూటకమని, కల్పితమని, అపోస్తలుడైన పౌలు డబ్బు కోసం క్రైస్తవునిగా మారిపోయాడని బోధిస్తారు.
వీరు వేసే ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూసేముందు వీరే కాకుండా ఇతర మతస్తులవారు కూడా బైబిల్ లో పరస్పర వ్యతిరేకాంశాలున్నాయి అని, బైబిల్ లో తప్పులున్నాయి అని అరోపించడానికి గల కారణాలేంటో చూద్దాం.
బైబిల్ చదవడానికి దేవుడిచ్చిన నియమాలు:
ఈ రెండు నియమాలకీ లోబడి బైబిల్ చదవాలి, అర్ధం చేసుకోవాలి.
బైబిల్ ను రాసిన రచయితల రచనా శైలిలో వ్యత్యాసాలు:
సువార్తలు రాసిన భక్తులు ఒక సందర్భం కోసం రాసినపుడు నిజంగానే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. అందుకు అయిదు కారణాలున్నాయి.
మొదటిది: ఒక సందర్భంలో ముగ్గురు మనుషులుంటే ఆ సందర్భాన్ని రాసేటప్పుడు ఒక వ్యక్తి ‘అక్కడ ముగ్గురున్నారు. అందులో ఒక వ్యక్తి ఇలా చేసాడు’ అని రాస్తాడు. 9మరో వ్యక్తి ఆ సందర్భంతో ఏ సంబంధం లేని మిగిలిన ఇద్దరిని విడిచిపెట్టి “అక్కడ ఒకరున్నారు. అతడు ఇలా చేసాడు” అని రాస్తాడు.
‘గెరాసేనీయుల దేశంలో ఉన్న సమాధుల లోనుండి ఒకరొచ్చారా, ఇద్దరొచ్చారా? క్రీస్తు దగ్గరకు ఒక గ్రుడ్డివాడిని తీసుకొచ్చారా, ఇద్దర్ని తీసుకువచ్చారా? క్రీస్తు సమాధి దగ్గరకు ఒక స్త్రీ వెళ్ళిందా, కొంతమంది వెళ్ళారా?’ అంటూ బైబిల్ విరోధులు వేసే అనేక ప్రశ్నలకు ఇదే సమాధానం.
రెండవది: ఒకరు ఒక సందర్భం కోసం రాసేటపుడు అక్కడ జరిగిన కొన్నింటిని వదిలేసి చిన్నగా రాయొచ్చు. ఇంకొకరు ఆ సందర్భాన్ని సవివరంగా రాయవచ్చు.
కొండమీద ప్రసంగం విషయంలోనూ, ఇంకా అనేక సందర్భాలను గూర్చి వాక్యవిరోధులు వేసే ప్రశ్నలకి ఇదే సమాధానం.
మూడవది: అప్పటి కాలంలో చాలామందికి రెండేసి పేర్లు ఉండేవి. బైబిల్ రచయితలు ఒక వ్యక్తి కోసం చెప్పేటపుడు ఆ వ్యక్తిని అతనికున్న వేరు వేరు పేర్లతో సంబోధించవచ్చు. అలాంటపుడు కూడా బైబిల్లో వ్యత్యాసాలున్నాయి అని పొరపాటుపడుతుంటారు. ఉదా: మోషే మామగారి పేరు యిత్రో మరియు రఘూయేలు (నిర్గ 2:18; 3:1).
నాలుగవది: బైబిల్ లో ఉన్న వ్యక్తులను గోత్రం పేరుతో, వంశం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, దేశం పేరుతో, పౌరసత్వం పేరుతో ఇలా రకరకాలుగా పేర్కొంటుంటారు. ఇలాంటి సందర్భంలో కూడా బైబిల్లో వ్యత్యాసాలున్నాయి అని ఆరోపిస్తుంటారు. ఉదా: పౌలు తనని తాను రోమీయూడను అంటాడు. ఇది పౌరసత్వం. యూదుడను అంటాడు. ఇశ్రాయేలీయులందరినీ యూదులు అని కూడా అంటారు. అది అతని జాతి. తనను బెన్యామినీయుడు అంటాడు. అది అతని గోత్రం. పౌలు, తార్సువాడు అని రాయబడింది. అది అతని ໖ (໑໖.55 22:3,25; ໖໖ 3:5).
అయిదవది: యేసుక్రీస్తు చేసిన కార్యాలను, ప్రసంగాలను భక్తులు రాసేటపుడు వరుస క్రమంలో రాయలేదు. అవసరాన్ని బట్టి, ఆయా రచయితలలో ఉన్న దేవుని ఆత్మ ప్రేరణను బట్టి రాసారు. ఇలాంటివేవీ అర్ధం చేసుకోకుండా ఆలోచించకుండా బైబిల్ లో తప్పులున్నాయి అని ఆరోపించడం అజ్ఞానం. ఈ అయిదు కారణాలకు సంబంధం లేకుండా ఏ తప్పులైతే క్రొత్త నిబంధనలో ఉన్నాయి అని జుడాయిజం వారు ప్రశ్నిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
1వ ప్రశ్న: నజరేతువాడు అని యేసుక్రీస్తును గూర్చి ఏ ప్రవక్తలు ప్రవచించారు (మత్త 2:23)?
జవాబు: నజరేతు అనే ఊరు తృణీకరించబడినది, విలువ లేనిది (యోహా 1:46). యేసుక్రీస్తు (మెస్సీయ) తృణీకరించబడినవానిగా అవుతాడని యెషయా 53:3 లో యిర్మీయా 14:8,9 లో వ్రాయబడింది.
2వ ప్రశ్న: బాప్తిస్మం పొందిన మరునాడు యేసుక్రీస్తు వెళ్తుంటే బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తును గూర్చి మాట్లాడాడు అని యోహాను 1:35-36 లో వ్రాయబడింది. మిగతా సువార్తలలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే 40 దినాలు ఉపవాసం ఉన్నాడని రాయబడింది. ఏది నమ్మాలి…?
జవాబు: అక్కడ మరునాడు అని రాయబడింది కానీ బాప్తిస్మం పొందిన మరునాడు అని రాయబడలేదు. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే ఉపవాసాలు చేసాడు. ఉపవాసాలు అయిన మరునాడు ఏం జరిగిందో యోహాను రాసాడు. వాక్యం కొంత ఇచ్చట, కొంత అచ్చట దొరుకుతుంది.
3వ ప్రశ్న: బలిపీఠం వద్ద చనిపోయిన జెకర్యా, యెహోయాడా కుమారుడు. కానీ యేసుక్రీస్తు బరకీయ కుమారుడు అని ఎందుకన్నాడు (285 24:20)?
జవాబు: బైబిల్లో చాలా మంది జెకర్యాలు ఉన్నారు. యేసుక్రీస్తు జెకర్యా 1:1 లో కనిపించే బరకీయ కుమారుడైన జెకర్యా కోసం
చెప్పాడు (మత్త 23:35)
4వ ప్రశ్న: మత్తయి 1:16 లో యోసేపు తండ్రి పేరు యాకోబు అని, లూకా 3:223 లో హేలీ అని ఎందుకు రాయబడింది? వీరిలో ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు?
జవాబు: మత్తయి, యోసేపు వంశావళి రాసాడు. కానీ లూకా మరియ వంశావళి రాసాడు. ఎందుకంటే మరియు కూడా దావీదు వంశస్తురాలయితేనే యేసుక్రీస్తు దావీదు వంశంలో జన్మించినట్లవుతుంది. ప్రవచనం నెరవేరినట్లు ఋజువు అవుతుంది (యెష 11:1).
దావీదు కుమారుడైన సొలొమోను వంశంలో యోసేపు, దావీదు మరో కుమారుడైన నాతాను వంశావళిలో మరియ జన్మించారు. మత్తయి రాసిన వంశావళిలో స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి. కానీ లూకా రాసిన వంశావళిలో ఒక్క స్త్రీ పేరు కూడా ఎందుకు కనిపించదు? యూదులు జన సంఖ్య చేసినప్పుడు స్త్రీలను లెక్కించరు (సంఖ్యా 1:2). దానినే ఛావనెస్టిక్ లా (Chauvinistic law) అంటారు. ఆ పద్ధతిలోనే లూకా రాసాడు. ఈ పద్ధతి ప్రకారం ఒక స్త్రీ వంశావళి రాసినపుడు చివర ఆమె పేరుకు బదులు ఆమె భర్త పేరును రాస్తారు.
5వ ప్రశ్న: జ్ఞానులకు నక్షత్రం దారి చూపడమేంటి? నక్షత్రం భూమికన్నా పెద్దది ఉంటుంది కదా?
జవాబు: నక్షత్రాలను సృజించినవాడు దేవుడు. ఆయన భూమికన్నా పెద్ద నక్షత్రాలను చేయగలిగినపుడు గుప్పెట్లో పట్టగలిగినంత చెయ్యలేదా…?
6వ ప్రశ్న: మత్తయి 27:44 లో సిలువపై దొంగలిద్దరూ యేసును దూషించారు. కానీ లూకా 23:39,40 లో ఒక దొంగ దూషించాడు మరో దొంగ మారాడు అని రాయబడింది. ఇందులో ఏది నిజం..?
జవాబు: రెండూ నిజాలే. మొదట ఇద్దరూ ప్రభుని దూషించారు. లూకా 23:34 లో యేసుక్రీస్తు, తనని హింసించిన వారిని క్షమించమని ప్రార్ధించాడు. అది చూసిన దొంగలలో ఒకడు మార్పునొంది పశ్చాత్తాపపడ్డాడు.
7వ ప్రశ్న: ఇస్కరియోతు యూదా ఉరిపోసుకుని చనిపోయాడా (మత్తయి 27:5) లేక క్రింద పడి నడిమికి విరిగి చనిపోయాడా
(໙໖ 1:18)?
జవాబు: మత్తయి 27:5 లో యూదా ఉరిపోసుకున్నాడు అని మాత్రమే రాయబడింది. చనిపోయాడు అని రాయబడలేదు. తాను ఉ రిపోసుకున్న చెట్టు కొమ్మ విరిగి అతడు క్రింద పడి నడిమకి విరిగి చనిపోయాడు.
8వ ప్రశ్న: యేసుక్రీస్తు తన సువార్త ప్రారంభంలో దేవాలయాన్ని ప్రక్షాళన చేసాడని యోహాను, సువార్త చివర ప్రక్షాళన చేసాడని మిగతా సువార్తలలోనూ రాయబడింది. దేన్ని నమ్మమంటారు?
జవాబు: మిగిలిన సువార్తలు యేసుక్రీస్తు సువార్త యొక్క ప్రారంభాన్ని, కొనసాగింపుని వివరంగా చెబుతూ ముగింపును చిన్నగా చెప్తాయి. కానీ యోహాను, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభాన్ని కొంచెం రాసి మిగిలినదంతా ఆయన సువార్త యొక్క ముగింపును రాసాడు.
9వ ప్రశ్న: బాప్తిస్మమిచ్చు యోహానే ‘ఏలీయా’ అని యేసుక్రీస్తు మత్తయి 11:14 లో చెప్పాడు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను ‘నేను ఏలీయాను కాను’ అని యోహా 1:21లో చెప్పాడు. దైవగ్రంథంలో ఇలా రాయబడుతుందా?
జవాబు: మలాకీ 4:5,6లో ఒక ప్రవక్త రాబోతున్నాడని, అతని పేరు ఏలీయా అని సాదృశ్యంగా రాయబడింది. కానీ పరిసయ్యులు… అగ్ని రధాలపై వెళ్ళిపోయిన ఏలీయా మళ్ళీ వస్తాడు అని పొరబడి, నీవు ఏలీయావా అని అడిగారు. అందుకే అతడు కాను అన్నాడు. యేసుక్రీస్తు ‘రాబోవు ఏలీయా’ ఇతడే అన్నాడు. పరిసయ్యులు వెళ్ళిపోయిన ఏలీయానే బాప్తిస్మమిచ్చు యోహాను అనుకున్నారు.
ఇలా బైబిల్ పై వారు వేసే ప్రతీ ప్రశ్నకు సమాధానముంది. క్రొత్త నిబంధనలో వ్యత్యాసాలు, తప్పులు లేవు. ఇందులో భక్తులు డబ్బుకు ప్రలోభపడి సువార్తలు, పత్రికలు రాయలేదు. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాసారు. బైబిల్ నూటికి నూరు శాతం దైవగ్రంథం. వేల సంవత్సరాలనుండి, కోట్ల మంది భక్తులు బైబిల్ చదువుతున్నా, వారికి ఏ సందేహాలు రాలేదు. కానీ ఈ సత్యవిరోధులకు మాత్రమే బైబిల్ లో తప్పులున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భక్తులు తమలో ఉన్న తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకోవడానికి బైబిల్ చదివారు.
ఈ దుర్బోధకులు బైబిల్లో తప్పులున్నాయేమో అని వెదకడానికి చదువుతున్నారు.
వీరు వాట్సేప్ గ్రూప్లు ప్రారంభించి క్రైస్తవులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఒక్కో పట్టణంలలోను 7గురు చొప్పున ఒక టీమ్ గా ఏర్పాటయ్యి క్రైస్తవుల్ని వ్యక్తిగతంగా కలుస్తూ, క్రీస్తు నుండి వేరుపరుస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం.