బైబిల్ కు ఏమాత్రం సరిపడని ఈ బోధ అమెరికాలో ప్రారంభమై ప్రస్తుతం 2 కోట్ల మంది సభ్యులు, 90 వేల మంది మిషనరీలతో అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఈ శాఖ వ్యవస్థాపకుని పేరు జోసెఫ్ స్మిత్..
జోసెఫ్ స్మిత్ జీవితం
ఇతడు అమెరికాకు చెందిన Sharon (Vemont Country)లో డిసెంబర్ 23, 1805లో జన్మించాడు. 1820లో ఇతనికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ప్రత్యక్షమై సంఘం చనిపోయింది. నీవు తిరిగి బ్రతికించాలి అని బోధించారు అని ఇతడు చెప్పుకున్నాడు. దీనితో పాటు ఇంకొక కట్టుకథను కూడా ఇలా చెప్పుకున్నాడు… సెప్టెంబరు 21,1823 సాయంత్రం నేను నా గదిలో ఉండగా ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో మహిమ దేహంతో తెల్లని వస్త్రాలతో గాలిలో నిలుచున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతని ముఖం మెరుపులా ఉ ఉంది. అతని పేరు మొరోనై, అతడు మోర్మన్ యొక్క కుమారుడు. ఈ మొరోనై పునరుత్థానుడై మహిమ దేహంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఖండం యొక్క మునుపటి నివాసుల యొక్క ఉనికిని గూర్చి, క్రీస్తు సువార్త ప్రాచీన నివాసులకు ఎలా అందింది అనే సంగతులను గూర్చి నీకు వివరిస్తాను అనీ, ఆ సంగతులన్నీ వ్రాయబడిన బంగారు పలకల్ని నీకిస్తాను అనీ, వాటితో పాటు ఊరీము, తుమ్మీములను కూడా నీకిస్తాను అని మొరోనై నాకు చెప్పాడు. వాటిని నిర్ణయించబడినవారికి తప్ప మరి ఎవ్వరికీ చూపకూడదని, చూపిస్తే చనిపోతావని కూడా చెప్పి సరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇది జరిగిన కొంతకాలానికి ఆ పలకలు ఎక్కడున్నాయో కూడా నాకు దర్శనమొచ్చింది’ అని జోసెఫ్ స్మిత్ చెప్పాడు.
ఆ తర్వాత ఆ పలకలు తాను న్యూయార్లో కనుగొన్నాననీ, ఆ దూత వాటిని తర్జుమా చెయ్యమని చెప్పాడనీ స్మిత్ చెప్పాడు. ఆ పలకల మీద ఉన్న భాష ఏంటో జోసెఫ్ స్మిత్కి తెలిసిపోయేదట. వాటిని చదువుతూ ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేయించాడట. తర్జుమా పూర్తయ్యాకా ఆ పలకల్ని 11 మందికి చూపించి మళ్ళీ ఆ దూతకి ఇచ్చేసానని కూడా అతడు చెప్పుకున్నాడు.
1) ఆ పలకలను 11 మందికి చూపించాను అని చెప్పాడు కానీ మేము చూచాము అని సాక్ష్యం చెప్పినవారెవరూ లేరు. 2) యేసుక్రీస్తు ఒక్కడే పునరుత్థానుడై మహిమ దేహాన్ని ధరించాడు. క్రీస్తు ప్రధమ ఫలముగా పునరుత్థానుడయ్యాడు (15రి 15:20) ఆ తర్వాత ప్రభు వచ్చినపుడు మాత్రమే చనిపోయినవారు పునరుత్థానమవుతారు. ఈ లోపు చనిపోయినవారెవరూ పునరుత్థానం అవడానికి అవకాశమే లేదు. మొరోనై అని ఇతడు చెప్పినది కట్టుకథ అని స్పష్టంగా తెలుస్తుంది.
జోసెఫ్ స్మిత్ తర్జుమా చేయించిన పుస్తకానికి ‘బుక్ ఆఫ్ మోర్మన్, యేసుక్రీస్తు యొక్క మరియొక నిబంధన’ అని పేరు పెట్టాడు. దీనిని వీరు బైబిల్గా గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పుస్తకం 115 భాషలలో అందుబాటులో ఉంది.
జోసెఫ్ స్మిత్ సేవ మరియు మరణం
మోర్మన్ గ్రంధాన్ని విడుదల చేసి కొంతమందిని అనుచరులుగా చేసుకున్నాడు. కొంతకాలానికి Nauvoo (U.S.A) కి మేయర్గా ఎన్నికయ్యాడు. డబ్బుతో పాటు రాజకీయ బలం కూడా అతనికి తోడయ్యింది. ఖరీదైన మందిరాలు నిర్మించడం ద్వారా మనుష్యులను ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఎవరైనా ఇతని దుర్బోధల్ని వ్యతిరేకిస్తే తనకున్న అధికారం ద్వారా అణిచివేసేవాడు. ఇతని వాక్చాతుర్యంతో, అనేక కల్పిత కథలతో వేలమందిని మోర్మన్లుగా మార్చాడు. ఇతనికి Emma Hole అనే భార్య ఉండగా మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అటు తరువాత తన మోర్మన్ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం వివిధ ప్రాంతాలకు తిరుగుతూ మొత్తం 52 మందిని పెళ్ళిచేసుకున్నాడు.
ఇతని పరిచర్యలో ఇతనితో అతి సన్నిహితంగా ఉండే వారిలో ఆరుగురి భార్యల్ని స్మిత్ పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. ఆ ఆరుగురికి ఈ విషయంలో స్మిత్ విభేధాలొచ్చాయి. స్మిత్, వారిని తన మినిస్ట్రీ నుండి తొలగించేసాడు. వారు విడిగా సేవ ప్రారంభించి, స్మిత్ చేసే దుర్బోధల్ని, అతని బహు భార్యత్వాన్ని గూర్చి అందరికీ తెలియజేయడం మొదలుపెట్టారు. Nauvoo Expositor అనే వార్తా పత్రికను స్థాపించి మొదటి ఎడిషన్లో స్మిత్ గురించి అనేక విషయాల్ని ఆధారాలతో ప్రచురించారు. స్మిత్ కోపంతో కొందర్ని తీసుకుని వెళ్ళి ఆ వార్తా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేసాడు. అతడు చేసిన ఈ అనుచిత ప్రవర్తనకు ప్రభుత్వం ఇతడిని అరెస్ట్ చేసి జూన్ 23, 1844లో హాంకాల్కు చెందిన Carthage జైల్లో పెట్టారు. అతని సహోదరుడైన హైరుమ్ని, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసారు.
జూన్ 27 రాత్రి కొందరు నల్లటి ముసుగులు ధరించి జైలు మీద దాడి స్మిత్ ను చంపేసారు. స్మిత్ చనిపోయేసరికి అతనికి 39 సం॥లు మాత్రమే. ఇతడు తనని తాను మలాకీ 4:6లో చెప్పబడిన ఏలీయాగా ప్రకటించుకుని మొత్తం 57 ప్రవచనాలు చెప్తే అందులో 52 ప్రవచనాలు పూర్తిగా అబద్ద ప్రవచనాలుగా మిగిలిపోయాయి. మోర్మన్లు బుక్ ఆఫ్ మోర్మన్తో పాటు స్మిత్ రాసిన ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అవి చెప్పినట్లుగానే వారు నడచుకుంటారు.
అసలు మోర్మన్ ఎవరు..?
ఇతడు క్రీ.శ 311లో జన్మించిన వ్యక్తి అని, ఇతని 11వ సం॥లో తన తండ్రి ద్వారా అమెరికాకు చెందిన జరాహెమ్లా అనే ప్రాంతానికి వెళ్ళాడని, ఇతని 15వ సం॥లో యేసుక్రీస్తు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు అని మోర్మన్ గ్రంధం చెప్తుంది. అప్పటికి ఆ ప్రాంతంలో నీఫై అనే తెగవారికి, లేమానీయులకి యుద్ధాలు జరిగేవని, ఈ రెండు తెగలవారు ఇశ్రాయేలీయులనుండి చెదిరిపోయిన జాతులని, ఇతడు నీఫైయులకు నాయకునిగా ఉండి యుద్ధాలు జరిగించాడని, ఆ సమయంలో అతనికి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేసాడని, అతని 74వ సం||లో నీఫైయులతో యుద్ధం చేస్తూ చనిపోయాడని, అతడు చనిపోయేముందు అప్పటివరకూ అతనికి వచ్చిన ప్రత్యక్షతల్ని బంగారు పలకలపై రాసి తన కుమారుడైన మొరొనైకి ఇచ్చాడని ఈ గ్రంథం చెప్తుంది. 4వ శతాబ్ధానికి చెందిన ఈ మొరొనై చనిపోయి, పునరుత్థానమై జోసెఫ్ స్మిత్కి ప్రత్యక్షమై పలకలు ఎక్కడున్నాయో చెప్పాడని స్మిత్ చెప్పుకున్నాడు. యేసుక్రీస్తును గూర్చిన సువార్త అప్పటికే చాలా దేశాలకి వెళ్ళిపోయింది. సువార్తలు వ్రాయబడటమే కాకుండా కొన్ని భాషలలోనికి తర్జుమా కూడా చేయబడ్డాయి. ఇవే విషయాలను కొంచెం కొంచెం మార్చి మళ్ళీ ఇంకో పుస్తకాన్ని దేవుడు ఎందుకు రాయిస్తాడు? నీఫైలకు లేమానీయులకు భారీ యుద్ధం జరిగిందని, లక్షల మంది చనిపోయారని, యుద్ధాయుధాలతో ఆ ప్రాంతం నిండిపోయిందని మోర్మన్ గ్రంధంలో రాయబడింది. క్రీ.శ 1వ శతాబ్దానికి చెందిన యుద్ధాలకు కూడా స్పష్టమైన పురావస్తు ఆధారాలు దొరికాయి కానీ 4వ శతాబ్దంలో జరిగిందని చెప్తున్న ఈ యుద్ధానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఎందుకని? ఇంకా ఏనుగులు, గుర్రాలు, స్టీల్ను ఆ తెగలవారు వినియోగించారు.అని రాయబడింది. కానీ 4వ శతాబ్దానికి అమెరికాలో ఇవేవీ లేవు.
మోర్మన్లయిన కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు మోర్మన్ గ్రంధం నిజమైనదని నిరూపించడానికి త్రవ్వకాలు, పరిశోధనలు జరిపి మోర్మన్ గ్రంధంలో వ్రాయబడ్డవి అసత్యాలని గ్రహించి దాన్ని విడిచిపెట్టారు.
జోసెఫ్ స్మిత్ బోధలు- వాటికి మా ప్రశ్నలు
స్మిత్ బోధ: చనిపోయిన వాళ్ళకోసం బాప్తిస్మం పొందితే ఆ చనిపోయినవారు మోర్మన్ల పరలోకంలోనికి ప్రవేశిస్తారు (Doctrines of Salvation, vol.11, p.141). 2 : 156 155 దుర్బోధకులని వ్రాయబడింది (1కొరి 15:12-14,29-34). అలా బోధించేవారి సాంగత్యం కూడా చెయ్యవద్దు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకడు చనిపోగానే వాని క్రియలు వానివెంట పోవునని బైబిల్ చెప్తున్నప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి కోసం బాప్తిస్మం పొందటం వలన ప్రయోజనమేంటి? ఇప్పటివరకూ చనిపోయిన అందరి పేర్లను జపిస్తూ అందరి బదులు వాప్తిస్మాలు పొందెయ్యొచ్చు కదా.
స్మిత్ బోధ: యేసుక్రీస్తు యొక్క మరియొక నిబంధన అని మోర్మన్ గ్రంధాన్ని గూర్చి ఇతడు చెప్పాడు. మా ప్రశ్న: యేసుక్రీస్తు ఇంకో నిబంధన చేస్తానని ఎక్కడైనా చెప్పాడా? అసలు మరో నిబంధన చెయ్యడానికి ఆయన నిబంధనలో ఏ లోపాలున్నాయి? క్రీస్తు చేసింది. |లోపంలేని నిబంధన అని హెబ్రి 8వ అధ్యాయంలో వ్రాయబడింది. అలాంటప్పుడు మరో నిబంధన చెయ్యాల్సిన అవసరం ఏముంది? బైబిల్లో ప్రకటన 21:18, 19లో బైబిల్కు ఏమీ కలుపకూడదని, అలా చేసినవాడికి నరకం తప్పదనీ వ్రాయబడింది. స్మిత్ ఏకంగా బైబిల్కు ఒక నిబంధనను, గ్రంధాన్ని కలపాలని చూసాడు. స్మిత్ ఏం కాబోతున్నాడు…?
స్మిత్ బోధ: దేవుడు శరీరము, ఎముకలతో మనలాంటి రూపమే కలిగున్నాడు (Doctrines and Covenents (D&C) 130:22), మా ప్రశ్న: ఆత్మ స్వరూపి అయిన వానికి శరీరమెందుకుంటుంది? వాక్కు శరీరాన్ని ధరించింది అని వ్రాయబడింది. అంటే భూమి మీదకి రాకమునుపు ‘వాక్కు’ అయివున్న దేవునికి శరీరం లేదనేకదా అర్థం?
ఇతర గ్రహాలపై మనుషులున్నారనీ, యేసుక్రీస్తు, సాతాను ఆత్మీయ సోదరులు అనీ, దేవుళ్ళు చాలామంది ఉన్నారనీ, నుంచి మోర్మన్గా జీవిస్తే చనిపోయాకా దేవునిగా మారిపోతారనీ, దేవునికి తల్లి ఉందనీ, భార్య ఉందనీ ఇలాంటి ఎన్నో దుర్బోధలు స్మిత్ చేసాడు. మానవులకు రక్షణ ఎలా కల్పించాలి అని దేవుడు అడిగితే అందరూ అన్ని రకాల ఉపాయాలు చెప్తే అందులో యేసుక్రీస్తు చెప్పిన ఉపాయం బాగుంది అని దేవుడు అన్నాడనీ. అపవాది ఇచ్చిన ఉపాయాన్ని తీసుకోలేదని కోపంతో అపవాది ఎదురుతిరిగి సాతానుగా మారాదు అని స్మిత్ బోధించాడు.
నిజానికి సాతాను మనిషిని మోసగించడం వలనే మనిషికి రక్షణ అవసరం అయింది. లేకుంటే మనిషికి రక్షణతో అవసరమే లేదు. వీరు కాఫీ, నల్లటి కూల్ డ్రింక్లు త్రాగరు. ఈత కొట్టారు. 16 సం|| వయస్సు వచ్చేవరకూ ఎవ్వరితోనూ డేటింట్ చెయ్యకూడదని, అది దాటితే డేటింగ్ చెయ్యొచ్చనీ వీరంటారు. ఇంకా ఇలాంటి వింతబోధలెన్నో వీరు చేస్తారు.
ఇతడు చనిపోయిన తర్వాత ఇతని అనుచరులు ఇతని గురించి మరింత విస్తారంగా ప్రకటించసాగారు. ప్రతీ సంవత్సరం 3 లక్షల మంది క్రొత్తగా మోర్మన్స్లోనికి చేరిపోతున్నారు. వీరంతా ఇతని పుస్తకాలలో స్మిత్ ఏం రాసాడో వాటినే అనుసరిస్తారు. వారికి బైబిల్తో సంబంధం లేదు.. వీరు విదేశీయులను మన ప్రాంతాలకు తీసుకువచ్చి ఈ దుర్వార్తను ప్రచారం చేయిస్తారు. తెల్ల చొక్కా, నల్లని ప్యాంట్తో సైకిల్ మీద తిరుగూతూ క్రైస్తవుల ఇంటింటికీ తిరుగుతూ రాత్రీపగలు వీరు పని చేస్తున్నారు.