fightoncults.com

షించియోంజి (క్రొత్తభూమి క్రొత్త ఆకాశం)

పార్క్ అనే వ్యక్తి 1956 లో జీసస్ క్రైస్ట్ రివైవల్ కాంగ్రగేషన్ను కొరియాలో స్థాపించాడు. అత్యంత వేగంగా విస్తరిస్తుండగా ఇతడు తనను తాను ప్రకటన 11:10 లో ఉన్న ఇద్దరు సాక్షులలో ఒకనిగా యెషయా 42:2 లో ఉన్న తూర్పు ప్రాంతపు నీతిమంతునిగా చెప్పుకున్నాడు.. ఈ పార్క్ తనకి స్వస్థతావరము లేకపోయినా ఉంది అనీ గారడీలు చేసిన మోసగాడు. ఇతని దగ్గర అనుచరునిగా పనిచేసిన లీ మన్ హీ, ఆ సంస్థ నుండి బయటికి వచ్చి షిన్చియోంచీ చర్చ్ ఆఫ్ జీసస్ ను ప్రారంభించాడు. దీనికి అర్ధం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అతని గురువులాగే ఈయన కూడా తనగురించి బైబిల్లో లో ఉంది అని ప్రకటించుకున్నాడు. ఈయన తన జీవితంలో జరిగింది అంటూ అల్లిన కథ ఏంటంటే….?

 

ఈయన రాత్రివేళ పొలంలో ఉంటే ఒక నక్షత్రం వచ్చి తనతో మాట్లాడేదట. ఆ విషయం తన కుటుంబంతో చెబితే నమ్మలేదట. ఈ లీ మాన్ హీ, ముందు పరలోకంలో ఉండేవాడట. ప్రకటన గ్రంధంలో యోహానుకు తోడుగా ఉన్న దేవదూత ఈయనేనట. ప్రకటన 2,3 అధ్యాయాల్లో 7గురు దూతలకు లేఖ రాసింది ఈయనేనట. ప్రకటన గ్రంధం రాసిన యోహానును నేనే అంటాడు. ఈయన పరలోకంలో ఉన్నవాడు కాబట్టి, అక్కడినుండి వచ్చినవాడు కాబట్టి ఈయన మాత్రమే ప్రకటన గ్రంథం గురించి సరిగా బోధించగలడని చెప్పుకుంటాడు. వీరు ప్రకటన గ్రంధం కోసం బోధించే ప్రతీదీ వాక్యవిరుద్ధమే. ఈయన ఈ తరానికి వాగ్దానం చేయబడిన సేవకుడిని (Promised Pastor) అని చెప్పుకుంటాడు. తనకి ఉన్న జ్ఞానమంతా దేవుడే ఇచ్చాడనీ, అతను ఇంతకు ముందు ఏ సంస్థలోనూ పనిచెయ్యలేదనీ, ఏ బైబిల్ తరగతులకు హాజరవ్వలేదని చెప్పుకుంటాడు. ఇదంతా పూర్తిగా అబద్ధం. ఇతనెవరో ఇతనికే ఒక క్లారిటీ లేదు. ఒకసారి దూతను అంటాడు. ఇంకోసారి యోహానుని అంటాడు. అంతలోనే ప్రామిస్డ్ పాస్టర్ని అంటాదు.

 

తాను ప్రకటన 7:2 లో కనిపించే తూర్పు దేశ దూతను అని, ప్రకటన గ్రంధ మర్మాలు చెప్పడానికి దేవుడు ఇతనిని పంపాడు అని, పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారు అని, ఇప్పటికి 85,000 మందిని సిద్ధపరిచాను అని, ఇతని బోధలు విని ఇతని సంఘములో చేరితేనే పరలోకము వెళ్తారు అని బోదిస్తాడు. వీళ్ళ సహవాసంలోనికి ఇప్పటికే 4 లక్షల మంది చేరారు.

 

వీరు ఉచిత బైబిల్ తరగతులు పేరుతో ప్రతీ దేశములోనికి ప్రవేశించారు. యవ్వనస్తులను, సేవకులను డబ్బు ఆశ చూప్, మర్మాలు, చెప్తాము అని అబద్ధాలు చెప్పి జాయిన్ చేసుకుని దుర్బోధలు నేర్పిస్తున్నారు. వీరు బోధ ప్రారంభించగానే దేవునికి, కుటుంబాలకు, సంఘానికి ఒక వ్యక్తిని దూరం చేస్తారు. కొరియాలో వీరి బోధలను గ్రుడ్డిగా నమ్మేసి కుటుంబాలను వదిలేసి మానసిక రోగులుగా మారినవారికోసం ప్రత్యేకంగా కౌన్సలింగ్ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. వీరు దుర్బోధకులు అని తెలియక కొంతమంది సేవకులు జాయిన్ అవుతుంటే, వీరు ఇచ్చే 500 రూ॥ ల కానుక కోసం చాలా మంది సేవకులు జాయిన్ అయిపోతున్నారు. ఫేస్బుక్, వాట్సేప్, యూట్యూబ్లలో ప్రతీ చోట షి„్చ నే… మన తెలుగు రాష్ట్రాలలో ప్రతీ పట్టణంలోనూ బైబిల్ స్టడీలు నిర్వహిస్తున్నారు.






Scroll to Top